News June 16, 2024

వీరిలో మీ నాన్న ఎలాంటి వారు? 1/2

image

ఒకప్పుడు నాన్నంటే మందలింపులు, దండనలు ఉండేవి. కానీ ఇప్పుడు ఓ స్నేహితుడిగా మారాడు. అన్ని విషయాల్లో దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు. ఒకప్పుడు నాన్న ఇంట్లో లేకపోతే అల్లరి. కానీ ఇప్పుడు నాన్న ఇంట్లో ఉంటేనే అల్లరి, లేదంటే నిశ్శబ్దమే. ప్రస్తుతం ప్రపంచంలో 7 రకాల నాన్నలు ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది.

Similar News

News January 6, 2025

రైతుల కుటుంబాల్లో సంక్రాంతి సందడి తీసుకొచ్చాం: నాదెండ్ల

image

AP: రాష్ట్రవ్యాప్తంగా నిన్నటికి 4.15 లక్షల మంది రైతుల నుంచి 2,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అన్నదాతల కుటుంబాల్లో సంక్రాంతి సందడి తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వం ఖరీఫ్‌లో 2.12 లక్షల మంది నుంచే ధాన్యం తీసుకుందని విమర్శించారు. తమ ప్రభుత్వం 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసిందని, ఇప్పటి వరకు రూ.6,083 కోట్లు చెల్లించిందని తెలిపారు.

News January 6, 2025

నటికి వేధింపులు.. 30 మందిపై కేసు

image

సోషల్ మీడియాలో కొందరు తనను <<15073430>>వేధింపులకు గురిచేస్తున్నారని<<>> హీరోయిన్ హనీ రోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు ఓ బిజినెస్‌మన్ తనను వేధిస్తున్నారని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పలువురు అభ్యంతరకర కామెంట్లు చేయడంతో ఆమె ఎర్నాకులం పోలీసులను ఆశ్రయించారు. వారి కామెంట్లు మానసిక వేధింపులకు కారణమయ్యాయని ఆమె పేర్కొన్నారు.

News January 6, 2025

HMPV.. కరోనా వైరస్‌లా ప్రమాదకరమా?

image

HMPV వైరస్ కొత్తదేమీ కాదని, ఎన్నో ఏళ్లుగా చాలా దేశాల్లో ఉందని HYD అపోలో ఆస్పత్రి వైద్యుడు సుధీర్ కుమార్ తెలిపారు. ఇది కరోనా లాంటిది కాదని, మహమ్మారి అయ్యే అవకాశాలు లేవంటున్నారు. సాధారణంగా 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో, వృద్ధుల్లో, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో HMPV సంక్రమిస్తుందని పేర్కొన్నారు. ఈ వైరస్ సోకిన 4-7 రోజుల్లో కోలుకుంటారని వివరించారు.