News June 16, 2024

CCS ప్రక్షాళన షురూ

image

TG: హైదరాబాద్ సీసీఎస్(సైబర్ క్రైమ్ స్టేషన్) ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. 12 మంది సీఐలు, నలుగురు ఎస్సైలపై బదిలీ వేటు వేశారు. ఇటీవల ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్ సుధాకర్ ఏసీబీకి పట్టుబడటం సహా పలు ఆరోపణలతో 14 మంది ఇన్‌స్పెక్టర్లను మల్టీజోన్ 2కు బదిలీ చేశారు.

Similar News

News January 6, 2025

మోహన్ బాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

image

జర్నలిస్టుపై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇవాళ వాదనలు కొనసాగాల్సి ఉండగా ఆయన తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అందుబాటులోకి రాలేదు. దీంతో మరో న్యాయవాది పాస్ ఓవర్ కోరగా ధర్మాసనం అంగీకరించలేదు. గురువారానికి వాయిదా వేసింది. కాసేపటికి ముకుల్ రోహత్గీ వచ్చి విజ్ఞప్తి చేసినప్పటికీ న్యాయమూర్తులు అంగీకరించలేదు.

News January 6, 2025

ఆందోళన వద్దు.. మీరోజు కోసం వేచి ఉండండి!

image

ఇద్దరూ ఒకేసారి ప్రారంభించినప్పటికీ నీ స్నేహితుడు ముద్దాడిన విజయం మీ దరిచేరలేదని ఆందోళన పడుతున్నారా? ఓసారి పైనున్న ఈ ఫొటో చూడండి. రెండు జామకాయలు ఒకేసారి పక్కపక్కనే పెరిగినా, ఒకటి మాత్రం పండుగా మారింది. అచ్చం ఇలానే విజయం కోసం మీ సమయం వచ్చేవరకూ వేచి ఉండాలి. నిరాశతో మీరు ఫెయిల్ అయ్యారని అనుకోకుండా మీరోజు కోసం వేచి ఉండండి. విజయంలో ఉన్న స్వీట్‌నెస్‌ను రుచిచూడండి.

News January 6, 2025

అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు

image

TG: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్ <<15069986>>పోలీసులు మరోసారి<<>> నోటీసులు జారీ చేశారు. కిమ్స్ ఆసుపత్రికి శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్లే ముందు తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆయన వెళ్తే గంటలోగా పర్యటన పూర్తి చేసుకోవాలన్నారు. దీనిని రహస్యంగా ఉంచాలని, ఎస్కార్ట్ భద్రత కల్పిస్తామన్నారు.