News June 16, 2024
చీరాల: సముద్ర తీరంలో విద్యార్థి గల్లంతు

చీరాల మండలం వాడరేవు సముద్ర తీర ప్రాంతంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. నూజివీడులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న 11 మంది విద్యార్థులు సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ కోసూరి కార్తీక్ (19), మైలవరపు కేదారేశ్వరరావు (19) అలల ధాటికి గల్లంతయ్యారు. మెరైన్ పోలీసుల సాయంతో కేదారేశ్వరరావును కాపాడగలిగారు. కార్తీక్ కోసం గాలిస్తున్నారు.
Similar News
News March 19, 2026
ప్రకాశం: ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 42 దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల (గ్రూప్-4: 12, క్లాస్-4: 30) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్‌మెన్ పోస్ట్‌లు ఉన్నాయి. అర్హులైన వారు ఏప్రిల్ 8 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.prakasam.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి, దరఖాస్తులను ఒంగోలు కలెక్టరేట్‌లో సమర్పించాలని కలెక్టర్ రాజబాబు తెలిపారు.
News March 19, 2026
ఒంగోలు: విధుల్లో గుండెపోటుతో కుప్పకూలిన కానిస్టేబుల్

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పనిచేస్తున్న ఎక్సైజ్ కార్యాలయ కానిస్టేబుల్ కందుల రాఘవరావు విధుల్లో ఉండగా మృతి చెందారు. సెంట్రీ డ్యూటీలో ఉండగా ఆయనకు గుండెపోటు రావడంతో బుధవారం ఒక్కసారిగా కుప్పకూలారు. ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా ఒంగోలు కాగా మృతదేహాన్ని అక్కడికి తరలించారు. ఐదు నెలల క్రితం ఈయన ఆత్మకూరుకు బదిలీపై వచ్చారు. ఆఫీసులోనే చనిపోవడంతో సహచర ఉద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
News March 19, 2026
మార్కాపురం కలెక్టరేట్‌లో ఈనెల 19న ఉగాది వేడుకలు

మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 19న ఉగాది ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న ఈ వేడుకలకు అధికారులు అందరూ హాజరుకావాలని ఆదేశించారు. పండుగ సంప్రదాయం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.


