News June 16, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలివే
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా కిష్టంపల్లిలో 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా కృష్ణలో 37.7, వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్లో 36.7, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో 36.5, గద్వాల జిల్లా తొత్తినోనిదొడ్డిలో 36.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతను నమోదయ్యాయి.
Similar News
News January 12, 2025
MBNR: ఎంపీగా మంద జగనాథం హ్యాట్రిక్‌గా గెలుపు.!
NGKL పార్లమెంటు నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎంపీగా పోటీ చేసిన మంద జగన్నాథం 4 సార్లు గెలిచి 2 సార్లు ఓటమి పాలయ్యారు. 1996లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1999, 2004లో టీడీపీ, 2009లో కాంగ్రెస్ నుంచి గెలిపోందారు. 1998లో టీడీపీ, 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చెయగా ఓడిపోయారు. 2024లో BSP నుంచి ఎంపీగా పోటీ చేయగా ఈసీ నామినేషన్ పత్రాలు తిరస్కరించారు.
News January 12, 2025
MBNR: మాజీ ఎంపీ జగన్నాథం రాజకీయ ప్రస్థానం.!
NGKL మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మృతి చెందారు. 1951 మే 22న పాలమూరు జిల్లా ఇటిక్యాలాలో జన్మించిన జగన్నాథం మెడిసిన్ చదివి కొంతకాలం డాక్టర్‌గా సేవలందించారు. 2009లో NGKL నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలుపోందారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో BRSలో చేరి ఓడిపోగా.. 2019లో టికెట్ రాలేదు. 2023లో కాంగ్రెస్‌లో టికెట్ రాకపోవడంతో BSP కొనసాగుతున్నారు.
News January 12, 2025
NGKL: 3 నెలల క్రితం పెళ్లి.. వివాహిత సూసైడ్
వివాహిత ఉరేసుకున్న ఘటన కొల్లాపూర్ మం.లో జరిగింది. కుటుంబీకుల వివరాలు.. కుడికిల్లకు చెందిన భవాని(20)కి 3 నెలల క్రితం పెబ్బేరు మ. పాతపల్లి వాసి రాజేందర్‌తో పెళ్లైంది. శుక్రవారం పుట్టింటికి వచ్చిన భవాని.. నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. డోర్ లాక్ చేసి ఉండటంతో స్థానికుల సహాయంతో భర్త పగలగొట్టారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న ఆమెను కొల్లాపూర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయింది.