News June 16, 2024

జగన్ ఇంటి ముందు నిర్మాణం కూల్చివేత.. అధికారిపై వేటు

image

హైదరాబాద్‌లోని YS జగన్ ఇంటి ముందు నిర్మాణం కూల్చివేత ఘటనలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్‌పై వేటు పడింది. ఆయనను GAD(సాధారణ పరిపాలన విభాగం)కి అటాచ్ చేస్తూ GHMC ఇన్‌ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలిచ్చారు. అధికారులకు సమాచారం ఇవ్వకుండా జగన్ ఇంటి ముందు షెడ్లను కూల్చివేసినందుకు హేమంత్‌‌పై చర్యలు తీసుకున్నారు.

Similar News

News January 6, 2025

ఐర్లాండ్‌తో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

image

ఐర్లాండ్‌‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కు బీసీసీఐ భారత మహిళల జట్టును ప్రకటించింది. ఈ టూర్‌కు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తోపాటు సీనియర్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్‌కు విశ్రాంతినిచ్చింది. 15 మందితో కూడిన జట్టుకు స్మృతి మంధాన నాయకత్వం వహిస్తారు. జట్టు: మంధాన (C), దీప్తి శర్మ, ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, ఉమా, రిచా, తేజల్, రాఘవి, మిన్ను మణి, తనూజ, ప్రియా, సాధు, సైమా, సయాలి.

News January 6, 2025

‘పుష్ప-2’ సంచలనం

image

భారతదేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా అల్లు అర్జున్ ‘పుష్ప-2’ నిలిచింది. ఈ సినిమా నిన్నటివరకు థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రూ.1,831 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొంది. బాహుబలి-2 లైఫ్ టైమ్ కలెక్షన్లు రూ.1,810 కోట్లను దాటేసి రెండో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా దంగల్(రూ.2వేల కోట్లకుపైగా) తొలి స్థానంలో ఉంది.

News January 6, 2025

పంచాయతీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ డోర్ క్లోజ్: మంత్రి పొంగులేటి

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ డోర్ క్లోజ్ అవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత పాలనలో పింక్ షర్ట్ వేసుకున్నవారికే ఇళ్లు ఇచ్చారని విమర్శించారు. ధరణిని పూర్తిగా ప్రక్షాళన చేశామని చెప్పారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీకి రమ్మంటే రావడం లేదని దుయ్యబట్టారు. అప్పుడంటే కాలు విరిగింది, ఇప్పుడేమైందని ప్రశ్నించారు.