News June 16, 2024

ZPTC పొలంలో తెల్లరాయి స్వాధీనం

image

నెల్లూరు జిల్లా చేజర్ల జడ్పీటీసీ సభ్యుడు పీర్ల పార్థసారథి పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.1.50 కోట్ల విలువైన 1560 టన్నుల తెల్లరాయిని గనుల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతించిన ప్రదేశంలో కాకుండా మరో చోట తవ్వకాలు చేస్తున్న వాహనాలను, తవ్విన ఖనిజాన్ని డీడీ శ్రీనివాస్ సీజ్ చేసి రెవెన్యూ, పోలీస్ విభాగాలకు అప్పగించారు. శ్రీరామ మినరల్స్ పేరుతో అనుమతి పొంది మరోచోట తవ్వకాలు చేసినట్లు సమాచారం.

Similar News

News April 1, 2026

డీసెట్-2026 నోటిఫికేషన్ విడుదల: DEO

image

ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థలలో ఇంటర్మీడియట్ అర్హతతో నిర్వహించనున్న రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డీఈవో ఆర్ బాలాజీ రావు తెలిపారు. ఇందుకు సంబంధించి https://cse.ap.gov.in, https://apdeecet.apcfss.in
వెబ్‌సైట్‌లో వివరాలు ఉన్నాయన్నారు. ఆసక్తి గలవారు గమనించాలని ఆయన కోరారు.

News April 1, 2026

నెల్లూరు: హైవే పక్కనే మద్యం షాపులు..!

image

నెల్లూరులో మందు బాబులకు ఇబ్బంది లేకుండా అడుగుకొక బార్, వైన్ షాపులు దర్శనమిస్తున్నాయి. నెల్లూరు హైవేకు సమీపంలో చిల్డ్రన్స్ పార్క్ నుంచి దీన్ దయాల్ నగర్ వరకు 7షాపులు ఉన్నాయి. మెడికవర్ హాస్పిటల్ ఎదురుగా ఒకటి, చిల్డ్రన్స్ పార్క్ దారిలో రెండు, అస్లీ ఢాబా పక్కన ఒకటి, ఎన్టీఆర్ నగర్ సమీపంలో రెండు, దీన దయాల్ నగర్ వద్ద ఒకటి ఉన్నాయి. ఇవి హైవేకి సమీపంలో ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

News April 1, 2026

నెల్లూరు జిల్లా అధికారులకు CM వార్నింగ్

image

రాష్ట్రస్థాయిలో ప్రభుత్వంపై ప్రజలు 67.37% మంది సంతృప్తిగా ఉంటే నెల్లూరు జిల్లాలో 69.33%మంది ఉన్నారని CM చంద్రబాబు చెప్పారు. ‘కలెక్టర్ హిమాన్షు శుక్లా పనితీరు బాగుంది. ఇంకా బాగా పనిచేసి ప్రజల ఓట్లు మాకు వచ్చేలా చూడండి. ఉదయగిరిలో R&B, రిజిస్ట్రేషన్ శాఖ పనితీరుపై ప్రజల సంతృప్తి మైనస్‌లో ఉంది. బీ కేర్‌‌ఫుల్. నేను ఆకస్మిక తనిఖీలకు వస్తా. దొరికితే చర్యలు తప్పవు’ అని సీఎం హెచ్చరించారు.