News June 16, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ఖాజీపేట సెక్షన్‌లో 3వ లైన్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా ప్రయాణించే నం.20803, నం.20804 విశాఖ-గాంధీ‌ధామ్ ట్రైన్లు ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌లు జూన్ 23 నుంచి జూలై 4 మధ్య విజయవాడ-విశాఖపట్నం మీదుగా కాక విజయనగరం-రాయగడ గుండా ఈ ట్రైన్ నాగ్‌పూర్ చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైన్‌లకు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి తదితర స్టేషన్లలో స్టాప్ లేదన్నారు.

Similar News

News October 3, 2024

కృష్ణా: ముంబై నటీ జెత్వానీ కేసులో నేడు హైకోర్టులో విచారణ

image

ముంబై నటీ జెత్వానీ కేసులో గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్ అధికారుల తరఫు న్యాయవాదులు మంగళవారం తమ వాదనలు వినిపించగా న్యాయస్థానం కేసును గురువారానికి వాయిదా వేసింది. ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ.. న్యాయవాది వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తమ వాదనలు వినిపించనున్నారు.

News October 3, 2024

వాహనాలకు ఎలాంటి పాస్ ఇవ్వడంలేదు: కలెక్టర్

image

విజయవాడ దసరా ఉత్సవాలలో VIP దర్శనాలకు ప్రత్యక యాప్ అందుబాటులోకి తెచ్చి 21 కేటగిరిల్లో పాస్‌లు ఇచ్చామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన తెలిపారు. ఈ పాస్‌లు కేవలం దర్శనం కోసమేనని, వాహనాలకు ఎలాంటి పాస్ ఇవ్వడంలేదన్నారు. ఈ పాస్‌లు ఉన్నవారు పున్నమి ఘాట్ వద్దకు చేరుకుంటే, అక్కడి నుంచి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన కార్లలో ఇంద్రకీలాద్రి కొండపైకి చేరుస్తామని కలెక్టర్ చెప్పారు.

News October 3, 2024

విజయవాడ, గుంటూరు మీదుగా తిరుపతికి APSRTC ఏసీ బస్సు

image

ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ, గుంటూరు మీదుగా తిరుపతికి ఇంద్ర AC బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతిరోజు అర్థరాత్రి ఒంటి గంటకు విజయవాడ చేరుకునే ఈ బస్సు(సర్వీస్ నం.47745) ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ సర్వీసును ఆదరించాలని ఆర్టీసీ అధికారులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.