News June 16, 2024
ఫర్నిచర్ దొంగ జగన్: మంత్రి అనగాని

AP: ప్రభుత్వ ఫర్నిచర్‌ను జగన్ వాడుకుంటున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ‘జగన్ ఫర్నిచర్ దొంగ. ఆయనకు నైతికత ఉంటే ఫర్నిచర్‌ను ప్రభుత్వానికి అప్పగించాలి. సరెండర్ చేయకుండా YCP నేతలు నీతులు చెప్పడం సిగ్గుచేటు. ₹50 కోట్ల CMO డబ్బుతో తాడేపల్లి, లోటస్‌పాండ్లలోని ఇళ్లలోకి ఫర్నిచర్, ఇతర వసతులను జగన్ అమర్చుకున్నారు. గతంలో కోడెలకు జగన్ చేసిందే ఈరోజు ఆయనకు తిరిగి వచ్చింది’ అని మంత్రి విమర్శించారు.
Similar News
News March 15, 2026
‘ఉగాది’ పండుగ ఎప్పుడు?

అమావాస్య గడియలు ఉండటంతో తెలుగు కొత్త సంవత్సరాది ‘ఉగాది’ ఎప్పుడు జరుపుకోవాలనే అయోమయం కొందరిలో నెలకొంది. అయితే చైత్ర శుక్ల పాడ్యమి రోజైన ఈ నెల 19(గురువారం)నే ఉగాది జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. 19న ఉదయం 6.52 గంటలకు ‘పరాభవ నామ సంవత్సరం’ మొదలవుతుందని పేర్కొంటున్నారు. అదేరోజు ఇంట్లో షడ్రుచులతో ఉగాది పచ్చడి తయారుచేసి స్వీకరించాలని సూచిస్తున్నారు.
News March 15, 2026
TVKతో పొత్తు ఉండదు: పళనిస్వామి

TNలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో TVKతో పొత్తు ఉండబోదని AIADMK జనరల్ సెక్రటరీ K.పళనిస్వామి తెలిపారు. మీడియాలో వస్తున్నవంతా వదంతులేనని కొట్టిపారేశారు. ఇప్పటి వరకు ఆ పార్టీతో అసలు చర్చలే జరపలేదన్నారు. అలాగే BJP లీడర్ అన్నామలైతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. మరోవైపు NDAతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్టార్ హీరో, TVK చీఫ్ విజయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
News March 15, 2026
ఈ జిల్లాల్లో వర్షాలు!

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ మధ్యాహ్నం నుంచి రేపు 8.30am వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడటానికి ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఇక రానున్న 5 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 2-4డిగ్రీలు తగ్గుతాయంది.


