News June 16, 2024
నెల్లూరు: సచివాలయ భవనానికి తాళం

సచివాలయ భవనానికి నెలల తరబడి అద్దె చెల్లించకపోవడంతో యజమాని తాళం వేసిన ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో వెలుగు చూసింది. వాసిలి గ్రామంలో ఐదేళ్లుగా సచివాలయాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. గతంలో అద్దె చెల్లించాలని యజమాని అడగగా.. వైసీపీ నాయకులు చెల్లిస్తామంటూ ముందుకు వచ్చారు. ఇటీవల అద్దె అడగగా.. తమకు సంబంధం లేదని వైసీపీ నాయకులు తప్పుకున్నారు. దీంతో యజమాని సచివాలయానికి తాళం వేశారు.
Similar News
News March 13, 2026
నెల్లూరు జిల్లాలో గ్యాస్ కొరత.. JC క్లారిటీ

నెల్లూరు జిల్లాలో గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వదంతులను ప్రజలు ఎవరూ నమ్మవద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గృహ వినియోగానికి సరిపడా LPG సిలిండర్లు నిల్వలు ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని భరోసా ఇచ్చారు.
News March 13, 2026
నెల్లూరు జిల్లాలో హోటళ్లు క్లోజ్!

నెల్లూరు జిల్లాలో 2వేల వరకు కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాయి. నాలుగు రోజుల నుంచి వీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. దీంతో చాలా చోట్ల హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మూతపడుతున్నాయి. కొందరు విధిలేని పరిస్థితుల్లో డొమెస్టిక్ సిలిండర్లు కొనుగోలు చేసి హోటళ్లు నడిపిస్తున్నారు. ప్రజలు సైతం డొమెస్టిక్ సిలిండర్ల బుకింగ్‌కు ఒకేసారి ప్రయత్నించడంతో కంపెనీలు సర్వర్లను బంద్ చేసినట్లు తెలుస్తోంది.
News March 13, 2026
నెల్లూరు జిల్లాలో రూ.30కోట్ల వసూళ్లు

నెల్లూరు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారిణి వసుమతి సూచించారు. ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలతో ఆమె టెలీకాన్పరెన్స్ నిర్వహించారు. మండలాల వారీగా పేరుకుపోయిన పన్నుల వసూళ్లపై సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు రూ.30 కోట్ల పన్నులు వసూలు చేయగా.. మిగిలిన రూ.16 కోట్లు ఈ నెల 15వ తేదీలోగా రాబట్టాలని ఆదేశించారు.


