News June 16, 2024

ఆర్బీఐకి అంతర్జాతీయ అవార్డు

image

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అంతర్జాతీయ అవార్డు లభించింది. లండన్‌కు చెందిన పబ్లిషింగ్ హౌస్ ‘సెంట్రల్ బ్యాంకింగ్’ RBIకి రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందించింది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోరంజన్ మిశ్రా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. రిస్క్ కల్చర్, అవేర్‌నెస్‌ను పెంపొందించినందుకు గాను అవార్డు అందుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 28, 2024

క్రిప్టో డీలా: రూ.1.2L నష్టపోయిన బిట్‌కాయిన్

image

క్రిప్టో కరెన్సీ మార్కెట్లు గత 24 గంటల్లో కాస్త డీలా పడ్డాయి. మార్కెట్ విలువ 1.43% తగ్గి $3.29Tగా ఉంది. బిట్‌కాయిన్ $1492 (Rs1.2L) నష్టపోయింది. ప్రస్తుతం స్వల్పంగా పెరిగి $94,472 వద్ద ట్రేడవుతోంది. రెండో అతిపెద్ద కాయిన్ ఎథీరియమ్ 1.23% నష్టంతో $3335 వద్ద కొనసాగుతోంది. BTC, ETH డామినెన్స్ వరుసగా 56,8%, 12.2%గా ఉన్నాయి. BNB, TRX 2% పెరగ్గా XRP 1.35, SOL 2.31, DOGE 0.55, AVAX 2.78% మేర తగ్గాయి.

News December 28, 2024

అంత సీన్ లేదు ‘పుష్పా’..!

image

AP: ‘పుష్ప-2’లో టన్ను ఎర్రచందనానికి రూ.కోటిన్నర వస్తాయని హీరో చెప్పడం గుర్తుందా? కానీ అటవీశాఖ మాత్రం అంత సీన్ లేదంటోంది. ఎర్రచందనం అమ్మేందుకు టెండర్లు పిలిచినా అంతగా స్పందన కనిపించట్లేదట. టన్ను ధర రూ.70 లక్షలుగా నిర్ణయించగా, చాలా మంది రూ.50 లక్షలకు మించి బిడ్లు వేయలేదు. చైనా, జపాన్, సింగపూర్, అరబ్ దేశాల్లో ఆర్థిక సంక్షోభం వల్ల ఖరీదైన ఫర్నిచర్ వినియోగం తగ్గి ఎర్రచందనానికి డిమాండ్ పడిపోయిందని అంచనా.

News December 28, 2024

పంత్ ఈసారి ఫెయిల్!

image

ఆస్ట్రేలియా గడ్డపై సూపర్ రికార్డు ఉన్న రిషభ్ పంత్ ఈసారి విఫలం అవుతున్నారు. BGT 2024-25లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. మొదటి టెస్టులో 38, రెండో టెస్టులో 49, మూడో టెస్టులో 9, నాలుగో టెస్టు (ఫస్ట్ ఇన్నింగ్స్)లో 28 పరుగులు మాత్రమే చేశారు. పంత్ బలహీనతలపై ఆస్ట్రేలియా బౌలర్లు ఫోకస్ చేసి ఔట్ చేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.