News June 16, 2024
ఆ బాత్‌రూమ్ పెద్దగా ఉంది?.. ఎవరికి స్కెచ్ వేశావు జగన్?: TDP
AP: రుషికొండలో భవనాలు రాష్ట్రపతి, ప్రధాని కోసం కట్టినవైతే ఇన్నాళ్లూ ఎందుకు దాచి పెట్టారంటూ YCPకి టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ‘ఇన్నాళ్లూ టూరిజం భవనాలని ఎందుకు చెప్పారు? దొరికిపోయాక ఇప్పుడెందుకు కథలు చెప్తున్నారు? బీచ్ వ్యూ పాలెస్ తనకు కావాలని భార్య అడిగిందే తడవుగా ప్రజాధనం తగలేశావు జగన్. అసలు ఆ బాత్ రూమ్ ఏంటి జగన్.. అంత పెద్దగా ఉంది? అసలు ఏం ప్లాన్ చేశావు? ఎవరికి స్కెచ్ వేశారు?’ అంటూ సెటైర్లు వేసింది.
Similar News
News January 17, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News January 17, 2025
శుభ ముహూర్తం (17-01-2025)
✒ తిథి: బహుళ చవితి తె.5.31 వరకు
✒ నక్షత్రం: మఖ మ.1.23 వరకు
✒ శుభ సమయం: సా.4.20-4.32 వరకు
✒ రాహుకాలం: ఉ.10.30-12.00 వరకు
✒ యమగండం: మ.3.00-4.30 వరకు
✒ దుర్ముహూర్తం: 1.ఉ.8.24-9.12 వరకు
2.మ.12.24-1.12 వరకు
✒ వర్జ్యం: రా.9.29-11.40 వరకు
✒ అమృత ఘడియలు: ఉ.10.51-12.31 వరకు
News January 17, 2025
BCCI కీలక నిర్ణయం.. ఆ సమయంలో షూటింగ్‌లు బంద్
టీమ్ ఇండియా ఆటగాళ్లపై BCCI మరిన్ని ఆంక్షలు విధించింది. సిరీస్‌లు జరుగుతుండగా ప్లేయర్లు ఎలాంటి షూటింగ్‌లు, ఎండార్స్‌మెంట్లలో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్‌లో ఘోర ఓటమి అనంతరం ప్లేయర్లకు స్వేచ్ఛ ఎక్కువవడంతోనే ఫామ్ కోల్పోతున్నారని తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సిరీస్ టూర్లకు వెళ్లినప్పుడు ఫ్యామిలీ కూడా ఎక్కువ సమయం వారితో ఉండకుండా ఆంక్షలు విధించేందుకు BCCI సిద్ధమైంది.