News June 16, 2024
కవిటి: హోరాహోరీ మ్యాచ్.. విజేత బోడర్

కవిటి మండలం శవసానపుట్టుగలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు నేటితో ముగిశాయి. కత్తివరం- బోడర్ మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో బోడర్ జట్టు విజయం సాధించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎంపీపీ అభ్యర్థి ప్రకాశ్.. విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రతి ఒక్కరూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రామారావు అన్నారు.
Similar News
News September 15, 2025
టెక్కలి: బహుభాషా కోవిధుడు రోణంకి

టెక్కలికి చెందిన ఆచార్య రోణంకి అప్పలస్వామి 1909లో జన్మించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ(ఆంగ్లం) పూర్తిచేసిన ఈయన ఆంధ్రాయూనివర్సిటీలో ఆచార్యునిగా బోధించారు. ఫ్రెంచ్, గ్రీక్, ఇటాలియన్ వంటి భాషలను అధ్యయనం చేశారు. బహుభాషా కోవిధుడుగా ఆదర్శంగా నిలిచారు. 1922-77 కాలంలో జాతీయ ఉపన్యాసకునిగా భారత ప్రభుత్వం నియమించింది. టెక్కలిలో విగ్రహంతో పాటు ఒక వీధికి ఈయన పేరు పెట్టారు. నేడు రోణంకి 116వ జయంతి.
News September 15, 2025
నేడు జడ్పీ కార్యాయలంలో PGRS కార్యక్రమం: కలెక్టర్

శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో సోమవారం ఉదయం PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం పరిష్కారం అయ్యిందో లేదో తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు పేర్కొన్నారు.
News September 14, 2025
ఎచ్చెర్ల: రేపు అంబేడ్కర్ యూనివర్సిటీలో NSS వాలంటీర్లు ఎంపిక

ఎచ్చెర్లలో గల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో NSS వాలంటీర్ల ఎంపిక సోమవారం జరుగుతుందని ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ డి. వనజ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చే ఏడాది దేశ దిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ పేరేడ్‌లో పాల్గొనేందుకు ఎంపికలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్టేట్ యూత్ ఆఫీసర్ సైదా రమావత్ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు.