News June 16, 2024

నెల్లూరు ప్రజల ఆశలన్నీ నారాయణపైనే..!

image

ఉమ్మడి జిల్లాలో గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట, కావలి, ఆత్మకూరు మున్సిపాల్టీలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది. మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిలిచిపోయాయి. మన జిల్లా వాసి నారాయణకే మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రి పదవి రావడంతో సమస్యలు తీరుతాయని ప్రజలు భావిస్తున్నారు. మరి మీ పట్టణంలో సమస్యలు ఏంటో కామెంట్ చేయండి.

Similar News

News March 2, 2026

నెల్లూరు: చికిత్స పొందుతూ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

image

కోవూరు(m), పాటూరుకు చెందిన పవన్ సాయి(19) గంగవరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 27న తన ఇంట్లోనే గడ్డి ముందు సేవించాడు. వాంతులు రావడంతో గమనించిన తండ్రి చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 2, 2026

‘నెల్లూరు కలెక్టర్ చొరవతో నా ఇల్లు నాకు వచ్చిందయ్యా’

image

‘కలెక్టర్ బాబు చొరవతో నా ఇల్లు నాకు వచ్చిందయ్యా’ అంటూ కావలికి చెందిన రమాజ్యోతి అనే వృద్ధురాలు ధన్యవాదాలు చెప్పేందుకు ప్రత్యేకంగా కలెక్టరేట్‌కు వచ్చారు. 2025 సెప్టెంబర్ 22న నడవలేని స్థితిలో ఉన్న రమాజ్యోతి కలెక్టరేట్‌కి వచ్చింది. కలెక్టర్‌ ఆమె సమస్యను అడిగి తెలుసుకొని పరిష్కారం చూపారు. కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన తొలి PGRSలో అందిన మొదటి అర్జీ ఇదే కావడం విశేషం.

News March 2, 2026

నెల్లూరులో ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’

image

నెల్లూరు ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. పిల్లలపై లైంగిక నేరాల నిరోధం, బాల్య వివాహాల నిర్మూలన, పోక్సో చట్టంపై శక్తి బృందాలు పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నాయి. అసాంఘిక శక్తులపై నిఘా పెంచుతూ.. పిల్లల రక్షణ కోసం డయల్ 100, 1098 సేవలను వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.