News June 16, 2024

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

image

AP: స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ఉద్దేశమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమమన్నది బక్రీద్ సారాంశం. హజ్రత్ ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు. త్యాగగుణాన్ని ప్రబోధించే బక్రీద్ పండుగ స్ఫూర్తిగా సమైక్యతను, సమానత్వాన్ని సాధిద్దాం’ అని CM పిలుపునిచ్చారు.

Similar News

News October 7, 2024

బీజేపీలో చేరిన పద్మశ్రీ గ్రహీత

image

పద్మశ్రీ అవార్డు గ్రహీత, గిరిజన కళాకారిణి దుర్గాభాయ్ బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ విధానాలకు ఆకర్షితురాలై ఆమె కాషాయ పార్టీలో చేరినట్లు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. స్వయంగా దుర్గాభాయ్ ఇంటికి వెళ్లిన సీఎం ఆమెకు బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. కాగా దుర్గాభాయ్ 2022లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.

News October 7, 2024

నిమ్మ రోజూ తినడం వల్ల ఉపయోగాలివే

image

నిమ్మకాయను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఉపయోగాలుంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ‘వాటిలో పుష్కలంగా ఉండే విటమిన్-సి శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో ఎక్కువ కాలరీలు ఖర్చై బరువు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. నిమ్మలోని పీచు పదార్థం వలన పొట్ట నిండుగా అనిపించి జంక్ ఫుడ్ లేదా ఆయిల్ ఫుడ్ తినాలన్న కోరిక తగ్గుతుంది. అరుగుదల మెరుగుపరుస్తుంది. అనారోగ్యాలు దరిచేరవు’ అని వివరిస్తున్నారు.

News October 7, 2024

వచ్చే ఏడాది మూడు చోట్ల బీచ్ ఫెస్టివల్: మంత్రి దుర్గేశ్

image

AP: రుషికొండ నిర్మాణాలను ఎలా హ్యండిల్ చేయాలో అర్థం కావడం లేదని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. అవినీతి సామ్రాజ్యానికి సూచికగా రుషికొండలో మ్యూజియం ఏర్పాటు చేయాలేమోనని సెటైర్లు వేశారు. కొత్త టూరిజం పాలసీ రూపకల్పన జరుగుతోందన్నారు. దీనిలో భాగంగా స్వదేశీ దర్శన్, ప్రసాద్ స్కీం రాష్ట్రంలో అమలు చేస్తామన్నారు. వచ్చే ఏడాది విశాఖ, కాకినాడ, బాపట్లలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు.