News June 16, 2024

హాలహర్వి: విద్యుత్ తీగలు తగిలి వివాహిత మృతి

image

హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే ఆదివారం లక్ష్మీ అనే వివాహిత పొలంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందారు. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త వీరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Similar News

News March 22, 2026

సజావుగా గ్యాస్ సరఫరా: కలెక్టర్

image

ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఎల్పీజీ సరఫరాపై ఎలాంటి అంతరాయం లేదని కర్నూలు కలెక్టర్ సిరి తెలిపారు. జిల్లాలో రోజుకు 11వేల సిలిండర్ల అవసరానికి గాను 18వేల సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. 42 గ్యాస్ ఏజెన్సీలపై ప్రత్యేక నిఘా పెట్టి సరఫరా పర్యవేక్షిస్తున్నామన్నారు. వినియోగదారులు ఆందోళన చెందకుండా అవసరానికి మించి బుకింగ్‌లు చేయవద్దని సూచించారు.

News March 22, 2026

కర్నూలులో 23న ప్రజా ఫిర్యాదుల వేదిక: కలెక్టర్

image

ఈ నెల 23 (సోమవారం)న కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. జిల్లాలోని అన్ని మండల రెవెన్యూ, డివిజనల్, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చని సూచించారు.

News March 22, 2026

కర్నూలు: ప్రమాదంలో 19 ఏళ్ల యువకుడి మృతి

image

గోనెగండ్ల మండలం వేముగోడులో మధ్యాహ్నం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. రవిరెడ్డి పొలంలో కాంట్రాక్టర్ బావన్న నీళ్ల బావిని JCBతో తవ్వుతూ మట్టిని ట్రాక్టర్‌లో నింపుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ట్రాక్టర్ ట్రాలీ, ఇంజన్‌కు మధ్య ఉన్న లింక్ తెగిపోయింది. దీంతో ట్రాక్టర్‌పై కూర్చున్న సాదిక్ బాషా(19) తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.