News June 16, 2024

విజయనగరం పై శ్రీకాకుళం జట్టు విజయం

image

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెక్కలి సమీపంలో జరుగుతున్న అంతర్ జిల్లాల అండర్-23 క్రికెట్ పోటీల్లో భాగంగా ఆదివారం శ్రీకాకుళం-విజయనగరం జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విజయనగరం జట్టు 44.2 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేశారు. 195 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీకాకుళం జట్టు 36 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసి విజయం సాధించింది.

Similar News

News March 4, 2026

శ్రీకాకుళం: టెన్త్ పాస్..230 ఖాళీలకు జాబ్ మేళా

image

శ్రీకాకుళం ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 6న ఉదయం 10 గంటల కు ఉద్యోగ మేళా జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి సుధ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అరబిందో ఫార్మా, అన్నపూర్ణ ఫైనాన్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ వంటి పలు సంస్థలు పాల్గొని, 230 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. 18–35 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అవసరమైన పత్రాలతో హాజరుకావాలని కోరారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News March 4, 2026

ఎచ్చెర్ల: డిగ్రీ విద్యార్థులకు గమనిక

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 4వ సెమిస్టర్ షెడ్యూల్‌ను యూనివర్సిటీ డీన్ అనురాధ బుధవారం విడుదల చేశారు. మార్చి 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా పరీక్షల ఫీజును చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 7వ తేదీ నుంచి జరుగుతాయని తెలిపారు.

News March 4, 2026

శ్రీకాకుళం: సకాలంలో పంచాయతీ ఎన్నికలు లేనట్టే?

image

ప్రభుత్వం సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని అధికార వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2 న సర్పంచుల పదవీకాలం ముగుస్తుండటంతో, ప్రత్యేక అధికారుల నియామకానికి కసరత్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 912 పంచాయతీలు, 657 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. సర్పంచ్, వార్డుల రిజర్వేషన్ ఖరారు సైతం జరగలేదు. ఎన్నికలపై స్పష్టత వచ్చేవరకు ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగనుంది.