News June 16, 2024

ఐర్లాండ్ బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్

image

టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ బ్యాటింగ్ ఘోరంగా విఫలమైంది. 20 ఓవర్లలో కేవలం 106 పరుగులకే పరిమితమైంది. డెలానీ(31), లిటిల్(22) ఫరవాలేదనిపించారు. మిగితా బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. పాక్ బౌలర్లలో అఫ్రిది 3, ఇమాద్ 3, అమిర్ 2, రవూఫ్ 1 వికెట్ చొప్పున తీశారు. పాక్ గెలవాలంటే 107 రన్స్ చేయాలి. ఈ రెండు జట్లు ఇప్పటికే సూపర్8 రేసు నుంచి నిష్క్రమించాయి.

Similar News

News September 14, 2025

ASIA CUP: ట్రెండింగ్‌లో Boycott INDvPAK

image

ఆసియాకప్‌లో భాగంగా మరికొన్ని గంటల్లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో SMలో కొందరు ఇండియన్స్ BoycottINDvPAK హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. టెర్రరిస్టులతో క్రికెట్ వద్దు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచును చూడకుండా టీవీలు ఆఫ్ చేసి పహల్గామ్ దాడి బాధితులకు అండగా నిలవాలని కోరుతున్నారు. మరికొందరు క్రికెట్‌ను ఉగ్రవాదంతో ముడిపెట్టకూడదని అంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News September 14, 2025

పెదాలు అందంగా ఉండాలంటే

image

పెదాలు అందంగా, తాజాగా ఉండాలంటే మీ స్కిన్‌కేర్‌లో లిప్ఆయిల్ యాడ్ చేసుకోవాల్సిందే. ఇది చూడటానికి లిప్‌గ్లాస్‌లా ఉంటుంది. దీనిలోని మాయిశ్చరైజింగ్ గుణాలు పెదాలు పగలకుండా చూస్తాయి. వీటిని లిప్‌స్టిక్‌కి జత చేస్తే పెదాలు ఎక్స్‌ట్రా షైనీగా ఉంటాయి. లిప్‌ఆయిల్స్‌లో ఉండే విటమిన్స్, ఫ్యాటీయాసిడ్స్ లిప్‌బామ్‌ కంటే ఎక్కువ హైడ్రేషన్‌ ఇస్తాయి. వీటిలో కూడా SPF ఉండేవి వాడితే యూవీ కిరణాల నుంచి పెదాలని రక్షిస్తాయి.

News September 14, 2025

BJP భౌగోళికంగా విస్తరించాల్సి ఉంది: సత్యకుమార్

image

AP: డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. PVN మాధవ్ సారథ్య యాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా APని తీర్చిదిద్దుతున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నాం. కేంద్రం, రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకులు పరిపాలిస్తున్నారు. రాష్ట్రంలో భౌగోళికంగా BJP ఇంకా విస్తరించాల్సి ఉంది’ అని అన్నారు.