News June 16, 2024
పేదోడి ఇల్లు.. పెత్తందారుడు కట్టుకున్న బాత్ రూమ్: TDP
AP: విశాఖ రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన భవనాలపై టీడీపీ Xలో విమర్శలు గుప్పిస్తోంది. ‘భార్య కోరిక కోసం, కొండని కొట్టి మరీ, ఈశాన్యంలో సముద్రం ఉండేలా, బీచ్ వ్యూతో రూ.500 కోట్లతో ప్యాలెస్. బాత్ టబ్ ఒక్కటే రూ.26 లక్షలు. మళ్ళీ పేదలు, పెత్తందార్లు అని జోకులు వేస్తూ, పేదలకు ఇళ్లు కూడా లేకుండా చేశాడు. పేదోడి కోసం కట్టిస్తానన్న ఇల్లు, పెత్తందారుడు కట్టుకున్న బాత్‌రూమ్’ అని Xలో ఓ ఫొటోను పంచుకుంది.
Similar News
News December 28, 2024
ఓటీటీలోకి కొత్త చిత్రం
కేన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ‘గ్రాండ్ పిక్స్’ అవార్డును పొందిన ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ మూవీ OTTలోకి రానుంది. పాయల్ కపాడియా తెరకెక్కించిన ఈ ఫీచర్ ఫిల్మ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో JAN 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ముంబై నర్సింగ్ హోమ్‌లో పనిచేసే ఇద్దరు నర్సుల కథే ఈ చిత్రం. కశ్రుతి, దివ్య ప్రధాన పాత్రల్లో నటించారు. US మాజీ అధ్యక్షుడు ఒబామా మెచ్చిన ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్‌నూ పొందింది.
News December 28, 2024
DAY 3: నిలిచిన ఆట.. నితీశ్-సుందర్ సెంచరీ భాగస్వామ్యం
బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజు వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. ఆట నిలిచే సమయానికి భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. నితీశ్(85*), సుందర్(40*) క్రీజులో ఉన్నారు. ఇవాళ తొలి సెషన్‌లో టీమ్ ఇండియా రెండు వికెట్లు కోల్పోగా, రెండో సెషన్‌లో నితీశ్-సుందర్ 105 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మ్యాచ్ నిలిచిపోవడంతో అంపైర్లు టీ బ్రేక్ ప్రకటించారు.
News December 28, 2024
మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు?
టెలికం కంపెనీలు టారిఫ్ రేట్లను పెంచే అవకాశం ఉందని ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ వెల్లడించింది. వచ్చే ఏడాది DECలో 15% టారిఫ్ పెంచవచ్చని తెలిపింది. ARPU లెవెల్స్ పెంచుకునేందుకు టెలికం కంపెనీలు ఇక నుంచి తరచూ ఈ పద్ధతి కొనసాగించొచ్చని పేర్కొంది. కాగా గత ఐదేళ్లలో మూడు సార్లు (2019, 21, 24)టారిఫ్ పెంచారు. 2019 SEPలో రూ.98 ఉన్న రీఛార్జ్ ప్లాన్ 2024 SEPకు రూ.193కి ఎగబాకింది.