News June 16, 2024
పెట్రోల్ ధరల పెంపును సమర్థించిన సీఎం సిద్దరామయ్య

కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై CM సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయం ప్రజా సేవలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తుందన్నారు. చాలా రాష్ట్రాల కంటే కర్ణాటకలో పెంచిన ధరలు తక్కువేనని తెలిపారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాగా పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై రూ.3.02లను కర్ణాటక ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ రూ.103, డీజిల్ రూ.89గా ఉంది.
Similar News
News March 10, 2025
ఛాంపియన్స్ ట్రోఫీలో వైట్ సూట్స్ ఎందుకంటే?

సాధారణంగా ఐసీసీ ట్రోఫీల్లో విజేతలు తమ జట్టు జెర్సీలతోనే కప్ అందుకుంటారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్స్ వైట్ బ్లేజర్స్ ధరిస్తారు. ఈ సూట్ ప్లేయర్ల గొప్పతనం, దృఢ సంకల్పాన్ని తెలిపే ‘గౌరవ బ్యాడ్జ్’ అని ఐసీసీ తెలిపింది. ట్రోఫీ కోసం చేసిన కృషి, స్ఫూర్తినిచ్చే అంశాలను ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ఛాంపియన్స్ ట్రోఫీ(నాకౌట్ టోర్నీ) 1998లో ప్రారంభమైనా ఈ వైట్ సూట్ సంప్రదాయం 2009 నుంచి మొదలైంది.
News March 10, 2025
రేపు అమరావతి పనులకు సీఎం శంకుస్థాపన

AP: రాజధాని అమరావతిలో నిర్మాణాల పున:ప్రారంభానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. సీఎం చంద్రబాబు రేపు రాజధాని పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12 నుంచి పలు ప్రైవేట్ సంస్థలు తమ నిర్మాణాలను విస్తరించనున్నాయి. ఎస్ఆర్ఎంలో రూ.700 కోట్లతో కొత్త విభాగాల నిర్మాణం, విట్‌లో వసతి గృహాలు, అకడమిక్ భవనాల ఏర్పాటుతో పాటు 4 కొత్త భవనాలు నిర్మించేందుకు అమృత్ వర్సిటీ ప్రణాళికలు సిద్ధం చేసింది.
News March 10, 2025
రోజూ తలస్నానం చేస్తున్నారా?

వెంట్రుకలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు తలస్నానం తప్పనిసరి. తలలో జిడ్డు చర్మం ఉన్నవారు వారానికి నాలుగు సార్లు హెడ్ బాత్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పొడి చర్మం ఉన్నవారు వారానికి 2 సార్లు చేయాలని చెబుతున్నారు. దుమ్ము, ధూళి, కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసిస్తే రోజూ హెడ్ బాత్ చేయాలని సూచిస్తున్నారు. ఇక వేసవిలో శిరోజాల సమస్యలు రాకుండా ఉండేందుకు వారానికి 4సార్లు చేయడం ఉత్తమమని చెబుతున్నారు.