News June 17, 2024
శ్రీకాకుళం: విద్యార్థులకు శుభవార్త చెప్పిన కేంద్ర విద్యాశాఖ

కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని స్వయం పోర్టల్‌లో 9-12 తరగతుల విద్యార్థులకు సైన్స్, గణితం తదితర సబ్జెక్టులలో ఉచిత ఆన్‌లైన్ కోర్సులు అందిస్తున్నట్లు NCERT తెలిపింది. ఈ కోర్సులు నేర్చుకునే వారు https://swayam.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 1లోపు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. ఈ పోర్టల్‌లో కోర్సు పూర్తైన అనంతరం అసెస్‌మెంట్, సర్టిఫికేషన్ ఉంటాయని NCERT స్పష్టం చేసింది.
Similar News
News March 13, 2026
శ్రీకాకుళం జిల్లాలో మెదటి సారి కిడ్నీ మార్పిడి చికిత్స

పలాస కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిలో నేడు మొట్టమొదటి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను విశాఖకు చెందిన వైద్య బృందం చేయనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి సుమారు రూ. 12 కోట్ల నిధులతో అత్యాధునిక పరికరాలు, అర్హత కలిగిన వైద్యులను నియమించి ప్రతి రోజు ఉచితంగా డయాలసిస్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలో సోంపేటకు చెందిన యువతి హేమశ్రీకి మొదటి కిడ్నీ మార్పిడి చికిత్స నేడు జరగనుందని MLA శిరీష ఓ ప్రకటనలో తెలిపారు.
News March 13, 2026
ఫైల్స్ క్లియెరెన్స్‌లో అచ్చెన్న బెస్ట్

పరిపాలన విభాగంలో ఫైల్స్ క్లియరెన్స్ అన్నది కీలకం. రాష్ట్ర మంత్రుల్లో మన జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు ఫైల్స్ క్లియరెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలల్లో 3,362 ఫైల్స్‌ను క్లియర్ చేశారు. 551 గంటలు ఫైల్స్ క్లియరెన్స్‌కు సమయం తీసుకున్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ల సమావేశంలో మంత్రిని ప్రత్యేకంగా అభినందించారు.
News March 13, 2026
జలుమూరులో అగ్ని ప్రమాదం

జలుమూరు మండలం నామాలపేటలో గురువారం సాయంత్రం జీడీ, నీలగిరి తోటలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న కోటబొమ్మాళి ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గ్రామ రైతులు ఎన్.భాస్కరరావు, ఎన్.లక్ష్మీనారాయణ, సీహెచ్ రత్నాలు, రమేశ్‌లకు చెందిన నాలుగు ఎకరాలు ఈ ప్రమాదంలో కాలిపోయాయి. సుమారు ఆస్తి నష్టం రూ.50వేల వరకు ఉంటుందని సిబ్బంది అంచనా వేశారు.


