News June 17, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 4 రోజులు వర్ష సూచన

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వచ్చే 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Similar News

News May 7, 2025

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం: కరీంనగర్ కలెక్టర్

image

ఇల్లందకుంట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన శుక్రవారం సభకు కలెక్టర్ పమేలా సత్పతి హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకుంటే రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. రూ.40 వేల విలువైన 54 రకాల వైద్య పరీక్షలను మహిళలకు ఉచితంగా అందిస్తున్నామని, తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. 6 నెలలకు ఒక్కసారి ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేసుకోవాలని తెలిపారు.

News April 25, 2025

కరీంనగర్ జిల్లాలో 44.4°C డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు

image

కరీంనగర్ జిల్లాలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతుంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 44.4°C నమోదు కాగా, జమ్మికుంట 44.3, కరీంనగర్, మానకొండూర్ 44.2, రామడుగు 44.1, చిగురుమామిడి, చొప్పదండి, తిమ్మాపూర్ 43.9, కరీంనగర్ రూరల్ 43.6, గన్నేరువరం 43.4, శంకరపట్నం 43.3, కొత్తపల్లి 43.2, వీణవంక 42.9, ఇల్లందకుంట 42.5, హుజూరాబాద్ 42.1, సైదాపూర్ మండలంలో 41.7°Cగా నమోదైంది.

error: Content is protected !!