News June 17, 2024
HYD: మళ్లీ వచ్చిన ధార్ GANG.. ఇవి గుర్తుంచుకోండి!

గ్రేటర్ HYDలో భయంకరమైన ధార్ గ్యాంగ్ వరుస చోరీలకు పాల్పడుతోంది. తాజాగా హయత్‌నగర్‌లో ఒకేసారి 5 ఇళ్లల్లో చోరీలకు పాల్పడింది. దివ్యాంగులు, భిక్షగాళ్లు, పని మనుషుల్లా నటిస్తూ వస్తారని, రెక్కీ నిర్వహించి రాత్రవగానే ఇళ్లలోకి చొరబడతారని పోలీసులు తెలిపారు. అడ్డొచ్చిన వారిని చంపేసేందుకు సైతం వెనకాడరని హెచ్చరించారు. కాలనీల్లో భద్రతా సిబ్బంది నియామకం, సీసీ కెమెరాల ఏర్పాటు వంటివి చేసుకోవాలన్నారు.
SHARE IT
Similar News
News September 15, 2025
HYD: ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలపై ప్రైవేట్ ఆస్పత్రులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 20 రోజులుగా పెండింగ్ బకాయిలపై ప్రభుత్వంతో అంతర్గత చర్చలు జరిపింది. అనంతరం ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని ప్రైవేటు ఆస్పత్రుల నిర్ణయం తీసుకున్నాయి. పెండింగ్‌లో ఉన్న బకాయిల్లో రూ.140 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
News September 15, 2025
HYD: 435 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి డ్రంక్& డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 435 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 306 బైకులు, 30 త్రీవీలర్, 97 ఫోర్ వీలర్‌లు, 2 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News September 15, 2025
‘10 లక్షల మంది విద్యార్థులతో HYDలో మహాధర్నా’

నేటి నుంచి ప్రైవేట్ కళాశాలలు నిరవదిక బంద్ చేయనున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడం లేదని ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు సమ్మె బాట పట్టాయి. ఈ నెల 21, 22న 10 లక్షల విద్యార్థులతో HYDలో మహాధర్నా చేపడతామని, దసరాలోపు రూ.1,200 కోట్ల బకాయిలు చెల్లిస్తేనే సమ్మె విరమిస్తానని విద్యా సంస్థల సంఘాల నాయకులు తేల్చి చెప్పారు.