News June 17, 2024

విశాఖ: సరుకు రవాణాలో ఏపీఎస్ఆర్టీసీ జోన్-1 రికార్డు

image

సరుకు రవాణాలో ఏపీఎస్ఆర్టీసీ జోన్-1 మొదటి స్థానంలో కొనసాగుతుంది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. సరుకు రవాణా ద్వారా ఈ జోన్ గత ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ 15వ తేదీ వరకు రూ.4.72 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఈ ఏడాది అదే కాలానికి 4.96 కోట్లు ఆర్జించినట్లు విశాఖ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ బీ.అప్పలనాయుడు తెలిపారు.

Similar News

News January 17, 2026

కేజీహెచ్‌లో రోగులతో మాట్లాడిన కలెక్టర్

image

కేజీహెచ్‌లోని శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వార్డులో పర్యటించారు. వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ మాట్లాడగా రోగి సిబ్బందికి డబ్బులు ఇచ్చినట్లుగా చెప్పడంతో విచారణకు ఆదేశించారు. అక్కడే ఉన్న సూపర్డెంట్ ఈ విషయంపై విచారణ చేయాలని వైద్యం కోసం ఏ ఒక్కరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అన్నిచోట్ల ఉచితంగా వైద్య సేవలు అనే బోర్డులు పెట్టాలని సూచించారు

News January 17, 2026

KGHలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన కలెక్టర్

image

KGHలో వైద్యం కోసం వచ్చే రోగులను ఎవరైనా డబ్బులు అడిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ హెచ్చరించారు. శనివారం KGHలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ట్రీట్‌మెంట్‌కు డబ్బులు అడిగినట్టు రోగి బంధువులు తనకు తెలిపారని, ఈ విషయంపై విచారణ చేపట్టాలని సూపరిండెంటెంట్‌ను ఆదేశించారు.

News January 17, 2026

KGHలో ఆన్‌లైన్ వైద్య సేవలు

image

ఇకపై KGHలో గంటల తరబడి ఓపీ, ఇతర వైద్య పరీక్షల కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యలకు చెక్ పెట్టే దిశగా ఈ-పాలన విధానాన్ని KGH అమలు చేయనుంది. రోగులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వైద్య సేవలను ఆన్‌లైన్ విధానంలో అందించడమే లక్ష్యంగా ఈ కొత్త వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు KGH అధికారులు తెలిపారు.