News June 17, 2024

ఆదిలాబాద్: ఏడాది నుంచి బాలికపై అత్యాచారం

image

బాలికపై ఆమె బంధువు మాయమాటలు చెప్పి ఏడాది కాలంగా అత్యాచారం చేస్తున్న ఘటన ఆదిలాబాద్ పట్టణంలో వెలుగు చూసింది. పట్టణంలోని ఓ కాలనీకి చెందిన బాలిక(17)ను ఆమె బంధువు రాజమౌళి(30) మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడు. విషయం తెలిసిన బాలిక కుటుంబీకులు అతడిని మందలించగా వారిని సైతం వేధించాడు. దీంతో వారు ఆదివారం 2టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అతడిపై పొక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు.

Similar News

News March 17, 2026

ADB: రెండు, మూడు రోజుల్లో శనగ కొనుగోళ్లు ప్రారంభం

image

ఆదిలాబాద్ జిల్లాలో రెండు మూడు రోజుల్లో శనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మార్క్‌ఫెడ్ DM ప్రవీణ్ కుమార్ తెలిపారు. క్వింటాల్‌కు రూ. 5,875 మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయనుందని పేర్కొన్నారు. రైతులు తమ పంటను శుభ్రపరిచి, తేమ శాతం 14% మించకుండా ఆరబెట్టి కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. గ్రామాల వారీగా కేటాయించిన తేదీల్లోనే పంటను తేవాలని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 17, 2026

ఆదిలాబాద్: మే 20న భారీ జాబ్ మేళా.. 7వేల కొలువులు!

image

ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం మే 20న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా ప్రకటించారు. ఈ మేళా ద్వారా సుమారు 5,000 నుంచి 7,000 వరకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ప్రారంభంలో వేతనాలు తక్కువగా ఉన్నా, కష్టపడితే భవిష్యత్తు బాగుంటుందని యువతకు సూచించారు. అర్హులైన నిరుద్యోగులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.