News June 17, 2024

రుషికొండ వివాదంపై మీ కామెంట్

image

విశాఖ వేదికగా రాష్ట్ర రాజకీయాలు హీటెక్కుతున్నాయి. రుషికొండ భవనాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, జనసేన ఇన్ ఛార్జ్ పంచకర్ల సందీప్ స్థానిక నాయకులు, మీడియా ప్రతినిధులతో ఆదివారం సందర్శించారు. ఆ భవనాల ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్రజా ధనాన్ని వృథా చేసి జగన్ రాజభవనాలు కట్టుకున్నారని టీడీపీ ఆరోపించగా.. అవి ప్రభుత్వ భవనాలే అని వైసీపీ తేల్చి చెబుతోంది. మరి ఈ వివాదంపై మీ కామెంట్

Similar News

News January 25, 2025

విశాఖలో ఈ రోజు జరిగే ముఖ్యమైన కార్యక్రమాలు

image

విశాఖలో శనివారం జరిగే ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వాహకులు తెలిపారు.➣ఉదయం 7.30కి సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్, సైబర్ సెక్యూరిటీ అంశంపై బీచ్ రోడ్డు, తెలుగు తల్లి విగ్రహం నుంచి వాకథాన్➣ఉదయం 10గంటలకు TDP కార్యాలయంలో హోంమంత్రి అనిత ప్రెస్ మీట్➣ఉదయం 10 గంటలకు KGHలో వెల్నెస్ సెంటర్ ప్రారంభం➣ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ ప్రెస్ మీట్➣మధ్యాహ్నం 12 గంటలకు ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి అంశంపై CPM సదస్సు

News January 25, 2025

విశాఖ పోర్టుకు కార్డేలియా క్రూజ్‌ షిప్‌

image

కార్డేలియా క్రూజ్‌ షిప్‌ విశాఖ పోర్టుకు రానుంది. పోర్టు యాజమాన్యం కృషి ఫలితంగా ఈ షిప్‌ పుదుచ్చేరి, చెన్నై- విశాఖల మధ్య ఆగస్టు 4 నుంచి 22 వరకు 3 సర్వీసులు నడిపేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. జీఏసీ షిప్పింగ్ (ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) ఈ షిప్‌కు ఏజెంట్‌గా వ్యవహరిస్తోంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి పోర్ట్ కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు.

News January 25, 2025

బ్యాంక్ అధికారులతో సమావేశమైన విశాఖ సీపీ

image

విశాఖ నగరంలో బ్యాంక్ అధికారులతో సీపీ శంఖబ్రత బాగ్చి శుక్రవారం సమావేశం అయ్యారు. సైబర్ క్రైమ్ బాధితులు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే దర్యాప్తు కోసం బ్యాంకులకు పోలీసులు సమాచారం కోరితే నెల రోజులు గడిచినా సమాచారం ఇవ్వడం లేదన్నారు. సైబర్ క్రైమ్, ఏటీఎంలలో దొంగతనం జరిగినప్పుడు పోలీసులకు బ్యాంక్ అధికారులు సహకరించాలన్నారు. బ్యాంకులు, పోలీసులు పరస్పర సహకారంతో బాధితులకు న్యాయం చేయొచన్నారు.