News June 17, 2024

మైదుకూరు: వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

కడప – మైదుకూరు జాతీయ రహదారిలో మైదుకూరుకు చెందిన రామచంద్రయ్య అనే వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 7 గంటలకు బైకుపై కడప నుంచి మైదుకూరు వెళ్ళే మార్గంలో ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది. అది గమనించిన స్థానికులు అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారని తెలిపారు.

Similar News

News October 3, 2024

కడపలో టెన్త్ అర్హతతో ఉద్యోగాలు

image

కడపలోని కాగితాలపెంట ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ఏడీ కె.రత్నబాబు తెలిపారు. ఈనెల 4న ఉదయం 10 గంటలతు టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన అభ్యర్థులు హాజరుకావాలన్నారు. ICICI బ్యాంకు, అభి గ్రీన్ టెక్నాలజీ, రిలయన్స్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలన్నారు.

News October 3, 2024

ఓటర్ల ప్రత్యేక జాబితాను సిద్ధం చేస్తున్నాం: కలెక్టర్‌

image

కడప ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా – 2025ను ఎలాంటి పెండింగ్‌ లేకుండా సిద్ధం చేస్తున్నామని కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్‌ యాదవ్‌కు తెలిపారు.
హౌస్‌టు హౌస్‌ ఓటర్ల సర్వే ప్రక్రియ జిల్లాలో 99.45 పూర్తయిందని చెప్పారు. ఫారం-6 ఫారం-7, ఫారం-8 సంబంధించి 01 జనవరి 2023 నుంచి 25 ఏప్రిల్‌ 2024 వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

News October 2, 2024

కడప: కేంద్ర కారాగారాన్ని సందర్శించిన కలెక్టర్

image

కడప జిల్లా కేంద్ర కారాగారాన్ని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ సందర్శించారు. గాంధీ జయంతి పురస్కరించుకొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. జైలు జీవితం గడుపుతున్న ప్రతి ఒక్కరూ క్షణిక ఆవేశంలో తప్పులు చేసి ఉంటారని అన్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. జైలు జీవితం గడిపేవారు విడుదల అయిన తర్వాత మంచి జీవితాన్ని గడపాలని సూచించారు.