News June 17, 2024
బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జూపల్లి
పాలమూరు ప్రజలకు మంత్రి జూపల్లి కృష్ణారావు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు చెప్పారు. త్యాగం, సహనం, ఐకమత్యానికి ప్రతీక బక్రీద్ అన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ సమైక్యతను సహోదర భావాన్ని అందరూ అనుసరించాలని కోరుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News January 12, 2025
MBNR: ఎంపీగా మంద జగనాథం హ్యాట్రిక్‌గా గెలుపు.!
NGKL పార్లమెంటు నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎంపీగా పోటీ చేసిన మంద జగన్నాథం 4 సార్లు గెలిచి 2 సార్లు ఓటమి పాలయ్యారు. 1996లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1999, 2004లో టీడీపీ, 2009లో కాంగ్రెస్ నుంచి గెలిపోందారు. 1998లో టీడీపీ, 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చెయగా ఓడిపోయారు. 2024లో BSP నుంచి ఎంపీగా పోటీ చేయగా ఈసీ నామినేషన్ పత్రాలు తిరస్కరించారు.
News January 12, 2025
MBNR: మాజీ ఎంపీ జగన్నాథం రాజకీయ ప్రస్థానం.!
NGKL మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మృతి చెందారు. 1951 మే 22న పాలమూరు జిల్లా ఇటిక్యాలాలో జన్మించిన జగన్నాథం మెడిసిన్ చదివి కొంతకాలం డాక్టర్‌గా సేవలందించారు. 2009లో NGKL నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలుపోందారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో BRSలో చేరి ఓడిపోగా.. 2019లో టికెట్ రాలేదు. 2023లో కాంగ్రెస్‌లో టికెట్ రాకపోవడంతో BSP కొనసాగుతున్నారు.
News January 12, 2025
NGKL: 3 నెలల క్రితం పెళ్లి.. వివాహిత సూసైడ్
వివాహిత ఉరేసుకున్న ఘటన కొల్లాపూర్ మం.లో జరిగింది. కుటుంబీకుల వివరాలు.. కుడికిల్లకు చెందిన భవాని(20)కి 3 నెలల క్రితం పెబ్బేరు మ. పాతపల్లి వాసి రాజేందర్‌తో పెళ్లైంది. శుక్రవారం పుట్టింటికి వచ్చిన భవాని.. నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. డోర్ లాక్ చేసి ఉండటంతో స్థానికుల సహాయంతో భర్త పగలగొట్టారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న ఆమెను కొల్లాపూర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయింది.