News June 17, 2024

టీడీపీలో చేరడం లేదు: YCP MLA

image

AP: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కర్నూలు జిల్లా ఆలూరు YCP MLA విరూపాక్షి ఖండించారు. ‘YCP టికెట్‌పై గెలిచి టీడీపీలోకి వెళ్లేందుకు నా ఆత్మసాక్షి ఎలా ఒప్పుకుంటుంది? నేను పార్టీ మారడం లేదు. YSR ఆశయాల కోసం జగన్ పట్టుదలను చూసి YCPలో చేరాను. జగన్ నన్ను MLAగా నిలబెట్టి గెలిపించారు. ప్రతిపక్షంలో ఉంటూ పోరాటం చేస్తా. వదంతులు నమ్మవద్దు’ అని కోరారు.

Similar News

News November 9, 2025

పాలలో వెన్నశాతం పెరగాలంటే?(2/2)

image

పశువులకు కొత్త మేతను ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా పెంచుతూ వెళ్లాలి. దాణా మేపడానికి 2-3గంటల ముందుగా పచ్చి, ఎండు గడ్డిని ఇవ్వడం ఉత్తమం. పశువుల నుంచి 6-7 నిమిషాల్లో పాలను పిండుకోవాలి. నెమ్మదిగా పిండితే కొవ్వు శాతం తగ్గుతుంది. పాలు పితికేటప్పుడు పశువును కొట్టడం, అరవడం లాంటివి చేయకూడదు. పశువులను మేత కోసం ఎక్కువ దూరం నడిపించకూడదు. వ్యాధులకు గురైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స అందించాలి.

News November 9, 2025

నష్టపరిహారం హెక్టారుకు రూ.25,000: అచ్చెన్న

image

AP: తుఫాను వల్ల పంటలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారాన్ని హెక్టారుకు ₹17వేల నుంచి ₹25వేలకు పెంచుతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అరటి పంటలకు అదనంగా ₹10వేలు కలిపి అందించనున్నట్లు వెల్లడించారు. దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు ₹1,500 చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టంపై ఈ నెల 11 నాటికి 100% అంచనాలు సిద్ధమవుతాయన్నారు. రైతులకు సకాలంలో ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తామని తెలిపారు.

News November 9, 2025

డెలివరీ తర్వాత నడుంనొప్పి వస్తోందా?

image

కాన్పు తర్వాత చాలా మంది మహిళల్లో వెన్నునొప్పి ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్మోన్లలో మార్పులు, వెయిట్ పెరగడం వల్ల నడుంనొప్పి వస్తుందంటున్నారు నిపుణులు. దీన్ని తగ్గించుకోవాలంటే వ్యాయామం చెయ్యాలి. కూర్చొనే పొజిషన్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సపోర్టింగ్ బెల్టులు, హీటింగ్ ప్యాడ్, ఐస్ ప్యాక్ వాడటం వల్ల నడుంనొప్పిని తగ్గించుకోవచ్చు. అలాగే ఏవైనా బరువులెత్తేటపుడు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.