News June 17, 2024
పోలవరంలో దొంగనోట్ల కలకలం

ఏలూరు జిల్లా పోలవరంలో ఆదివారం దొంగ నోట్లు కలకలం రేపాయి. నేడు సీఎం పర్యటన నేపథ్యంలో కాఫీ హోటళ్లు, తినుబండారాల షాపులు, కిరాణా దుకాణాలు కిటకిటలాడాయి. లావాదేవీలు సమయంలో వచ్చిన కొత్తనోట్లను ఆ తర్వాత మరొకరికి ఇచ్చే సమయంలో దొంగనోట్లని తేలడంతో తాము మోసపోయినట్లు వ్యాపారులు గుర్తించారు. సుమారు ఏడుగురు వ్యాపారులు మోసపోయినట్లు గుర్తించారు.
Similar News
News March 26, 2026
భీమవరంలో నో స్టాక్ బోర్డులు

భీమవరంలో గ్యాస్ కొరత వేధిస్తోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఇంధన కొరత లేదని కలెక్టర్ ప్రకటించినప్పటికీ, పలు గ్యాస్ ఏజెన్సీలు ‘నో స్టాక్’ బోర్డులు పెడుతుండటంపై వారు మండిపడుతున్నారు. దీనివల్ల నిత్యావసరాలకు ఇబ్బంది ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కృత్రిమ కొరత సృష్టిస్తున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గ్యాస్ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.
News March 26, 2026
ప.గో జిల్లా ప్రజలకు శుభవార్త

ఆచంట(M) అయోధ్య లంకలో వశిష్ట గోదావరిపై వంతెన నిర్మాణానికి CM చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీనికి రూ.110 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. ప.గో జిల్లా ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిధులు కేటాయించారు. వంతెన నిర్మాణం పూర్తయితే లంకగ్రామాల ప్రజల కష్టాలు తీరనున్నాయి. దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై Way2News పలు వార్తలు ప్రచురించిన విషయం తెలిసిందే.
News March 26, 2026
ఆ సమయంలో రోడ్లపైకి రావొద్దు: ప.గో కలెక్టర్

వేసవి ఉద్ధృతి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు. ఎండల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.


