News June 17, 2024
ఉద్యోగాల పేరుతో సైబర్ మోసాలు: బాపట్ల SP

ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల కొత్త తరహా సైబర్ మోసాలతో తక్కువ సమయంలో నగదు సంపాదించాలని నేరగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. పార్ట్‌టైం ఉద్యోగాల పేరిట టెలిగ్రామ్‌లో లింక్ పంపి క్లిక్ చేయగానే రూ.లక్షల్లో నగదు వసూలు చేస్తున్నారన్నారు. హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.
Similar News
News March 13, 2026
గ్యాస్ బుక్ చేసే వారికి ఎస్పీ సూచనలు

గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు SP వకుల్ జిందాల్ సూచించారు. వంటగ్యాస్ సిలెండర్ల కొరత ఉందనే అపోహలను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మల్చుకొని ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. అదనపు సిలెండర్లు కేటాయిస్తామని బురిడీ కొట్టిస్తున్నారని వివరించారు. అనుమానస్పద లింకులు ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చెయ్యొద్దని సూచించారు.
News March 13, 2026
తెనాలిలో రన్నింగ్ బస్సు కిందకి దూసుకెళ్లిన టెన్త్ విద్యార్థి

తెనాలి మారీసుపేటలోని హైస్కూల్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థి లీలాసాయి మణికంఠ ఒక్కసారిగా బస్సు కిందకి దూసుకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కొత్త వంతెన వద్ద డివైడర్‌పై నడిచి వెళుతున్న అతను అదే సమయంలో నగరం నుంచి తెనాలి వస్తున్న RTC బస్సు కిందకు దూసుకు వెళ్లాడు. డ్రైవర్ గమనించి బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. స్పృహ కోల్పోయిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 13, 2026
గుంటూరు: రేపు జాతీయ లోక్ అదాలత్

జాతీయ లోక్ అదాలత్‌ను ఈ నెల 14న నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. 14న ఉదయం 10 గంటల నుంచి జిల్లా న్యాయస్థానం ఆవరణలో లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో సివిల్, కాంపౌండబుల్, క్రిమినల్ కేసులు, కుటుంబ, వివాహ సమస్యలు పరిష్కరించుకోవచ్చని చెప్పారు.


