News June 17, 2024
పెద్దిరెడ్డి ఊరిలో టీడీపీకి పడింది 9 ఓట్లే..!

కూటమి జోరులోనూ పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మరోసారి గెలిచారు. ఈ నేపథ్యంలో ఆయన సొంత ఊరైన సదుం మండలం ఎర్రాతివారిపాలెంలో ఆయనకు పడిన ఓట్లపై పలువురు ఆరా తీస్తున్నారు. స్థానిక గ్రామంలో మొత్తం 862 ఓట్లు ఉన్నాయి. ఇందులో 846 మంది వైసీపీకి ఓటు వేశారు. కేవలం 9 మందే టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డికి ఓటు వేశారు. ఐదుగురు కాంగ్రెస్‌కు, ఇద్దరు బీసీవై పార్టీకి మద్దతు తెలిపారు.
Similar News
News April 2, 2026
చిత్తూరు: గ్రీన్ ఫీల్డ్ హైవేపైకి వాహనాల అనుమతి

చిత్తూరు-తచ్చూరు గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు దాదాపు పూర్తయ్యాయి. వాహనాల ట్రయల్ రన్‌లో భాగంగా పూర్తిస్థాయిలో అనుమతినిచ్చారు. దీంతో పలు వాహనాలు ప్రయాణించాయి. చిత్తూరు నుంచి తమిళనాడులోని ఊత్తుకోట వరకు 95 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ మొత్తం దూరాన్ని ఒకటిన్నర గంటలోనే చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
News April 2, 2026
చిత్తూరు కలెక్టర్ హెచ్చరికలు ఇవే..!

మెడికల్ ఏజెన్సీలు నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ కిట్లు, నార్కో టిక్ డ్రగ్స్ అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. ఔషధ నియంత్రణ, సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశాలు నిర్వహించారు. డాక్టర్ల ప్రిస్కిప్షన్ ఉంటేనే మెడికల్ షాపుల్లో మందులు విక్రయించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు చేయాలని సూచించారు.
News April 2, 2026
వాటి జోలికెళితే డేంజర్: చిత్తూరు SP

లోన్ యాప్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సూచించారు. తెలియని యాప్‌ల ద్వారా రుణాలు పొందితే వ్యక్తిగత జీవితం ప్రమాదంలో పెట్టినట్లేనని ఆయన హెచ్చరించారు. లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థలు, బ్యాంకుల ద్వారా మాత్రమే రుణాలు పొందాలని సూచించారు.


