News June 17, 2024

పోరుమామిళ్లలో యువకుడి సూసైడ్

image

పోరుమామిళ్ల మండలం అక్కల రెడ్డి పల్లె గ్రామ సమీపాన టెలిఫోన్ టవర్‌కు ఉరి వేసుకొని సోమవారం ఉదయం యువకుడు మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. మృతుడు దాసరపల్లి ప్రేమ సాగర్ (22) గా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోరుమామిళ్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 2, 2026

కడప: గత నెలలో AMCల ఆదాయం ఎంతంటే.!

image

కడప జిల్లాలో 11 వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC)లు ఉన్నాయి. వీటిద్వారా గత నెలలో మార్కెట్ సెస్ రూపంలో రూ.1.55 కోట్లు ఆదాయం లభించింది.
AMCల వారీగా ఆదాయం రూ.లక్షల్లో ఇలా. కడప-18.95, ప్రొద్దుటూరు-20.35, బద్వేల్-29.77, జమ్మలమడుగు-16.64, పులివెందుల-15.48, రాజంపేట-2.80, మైదుకూరు-17.59, కమలాపురం-17.15, సిద్ధవటం-0.47, ఎర్రగుంట్ల-11.49, సింహాద్రిపురం-5.14 లక్షలు మార్కెట్ సెస్ రూపంలో వసూలైంది.

News March 2, 2026

కడప: ‘రూ.120.68 కోట్లు వసూలు’

image

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కడప రీజనల్ పరిధిలో AMCల ద్వారా రూ.120.68 కోట్లు మార్కెట్ సెస్ లభించిందని కడప JDM రామాంజనేయులు తెలిపారు.
జిల్లాల వారీగా ఆదాయం రూ.కోట్లల్లో ఇలా.
కడప-11.78, అనంతపురం-10.65, చిత్తూరు-7.34, కర్నూల్-34.43,
నంద్యాల-23.33, తిరుపతి-20.54, అన్నమయ్య-8.34,
సత్యసాయి-4.24 కోట్లు లభించినట్లు తెలిపారు.
కాగా ఫిబ్రవరిలో రూ.19.14 కోట్లు వసూలైందన్నారు.

News March 2, 2026

కడప జిల్లాలో 34 సెంటర్లలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు.!

image

కడప జిల్లాలో సోమవారం నుంచి 34 సెంటర్లలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 5,884 మంది రెగ్యులర్, 619 మంది సప్లిమెంటరీ, మొత్తం 6,503 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. సోమవారం ఇంగ్లిష్ పరీక్షకు 5,424 మంది విద్యార్థులు హాజరయ్యారు. 635 మంది ఆబ్సెంట్ అయ్యారు. కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేల్, మైదుకూరు, కమలాపురంలోని 34 ప్రభుత్వ హైస్కూళ్లలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.