News June 17, 2024

కృష్ణా: విద్యార్థులకు శుభవార్త చెప్పిన కేంద్ర విద్యాశాఖ

image

కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని స్వయం పోర్టల్‌లో 9-12 తరగతుల విద్యార్థులకు, సైన్స్ తదితర సబ్జెక్టులలో ఉచిత ఆన్‌లైన్ కోర్సులు అందిస్తున్నట్లు NCERT తెలిపింది. ఈ కోర్సులు నేర్చుకునే వారు https://swayam.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 1లోపు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. ఈ పోర్టల్‌లో కోర్సు పూర్తైన తర్వాత అసెస్‌మెంట్, సర్టిఫికేషన్ ఉంటాయని NCERT స్పష్టం చేసింది.

Similar News

News November 28, 2024

కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో జ్యోతిరావు పూలే వర్ధంతి

image

మచిలీపట్నంలోని కలెక్టరేట్ మీటింగ్ హాలులో గురువారం మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ డీకే బాలాజీ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల సముద్దరణకు ఆయన చూపిన మార్గం అనుసరణీయమన్నారు. 

News November 28, 2024

కృష్ణా: ‘ఈనెల 30వరకు ఆ పని చేయకండి’

image

నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం స్థిరంగా కొనసాగుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు గరిష్ఠంగా 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నెల 30 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని APSDMA హెచ్చరించింది. వాయుగుండం ప్రభావం ఉన్నందున జిల్లా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. 

News November 28, 2024

నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న మంత్రి నాదెండ్ల 

image

మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి పర్యటన పామర్రులో ప్రారంభమై పెడన నియోజకవర్గంలోని గూడూరు, పెడన, బంటుమిల్లి మీదగా కృత్తివెన్ను చేరనుంది. పర్యటన సందర్భంగా జిల్లాలోని పలువురు రైతులను కలసి వారి వ్యవసాయ సమస్యలు తెలుసుకోనున్నారు. అనంతరం పలు వ్యవసాయ శాఖ కార్యాలయాలను సందర్శించునున్నారు.