News June 17, 2024
కూకట్‌పల్లి: జేఎన్టీయూలో ఆందోళనలపై నిషేధాజ్ఞలు

JNTUలో విద్యార్థుల ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీల కట్టడికి వర్సిటీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రిజిస్ట్రార్ డా.వెంకటేశ్వరరావు వర్సిటీ క్యాంపస్, ఇంజినీరింగ్ కాలేజీలకు సర్కులర్ జారీ చేశారు. సాంబారులో పురుగులు ఉన్నాయంటూ మంజీరా హాస్టల్‌లో విద్యార్థులు ధర్నా చేయడం, వర్సిటీ పాలనాపరమైన కొందరి పదోన్నతులపై ధర్నా నేపథ్యంలో ఇన్‌ఛార్జ్ వీసీ వెంకటేశం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
Similar News
News March 7, 2026
VFX హబ్‌గా HYD.. ప్రారంభించనున్న సీఎం

ప్రముఖ OTT సంస్థ నెట్ ఫ్లిక్స్ తన కార్యాలయాన్ని హైదరాబాదHలో ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఈ నెల 12న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు దీనిని ప్రారంభించనున్నారు. 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ స్టూడియోను ప్రారంభించనుంది. భారతదేశంలో తనకు రెండో కార్యాలయం కానుంది. దీని ద్వారా VFX, గేమింగ్ కామిక్స్ రంగంతో పాటు వివిధ రంగాలలో మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని చెబుతున్నారు.
News March 7, 2026
HYDలో DANGER కంటి‘న్యూస్’

నగరంలో గాలి నాణ్యత పడిపోతుండటంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా రెండంకెల స్థాయిలో ఉండాల్సిన గాలి నాణ్యత సూచీ శనివారం బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో అత్యధికంగా 248గా నమోదైంది. వాహనాల పొగ, చెత్తాచెదారం తగలబెట్టడం కారణంగా కాలుష్య స్థాయిలు పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ప్రజలు మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.
News March 7, 2026
HYDకు చేరువలో అద్భుతమైన అందాలు.. వెళ్దామా?

HYD నగరానికి చేరువలో నల్లమల అడవుల అందాలను ఆస్వాదించాలనుకునే వారికి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ వేదికగా నిలుస్తోంది. ఇక్కడి ‘మన్ననూర్ జంగిల్ రిసార్ట్’లో పులుల సఫారీ, పక్షుల కిలకిలరావాల మధ్య ఉదయం ట్రెక్కింగ్ వంటివి పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. స్థానిక చెంచులతో కలిసి అడవి రహస్యాలను తెలుసుకునే వీలుంది. ఆధునిక వసతులు, భోజన సౌకర్యాలతో కూడిన ఈ పర్యాటక ప్యాకేజీ కోసం <


