News June 17, 2024
ప్రొద్దుటూరు: సరఫరాలపై జగన్ ఫొటో తొలగింపు

అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే పోషకాహార వస్తువులపై టీడీపీ ప్రభుత్వం మాజీ సీఎం జగన్ ఫొటోలను తొలగించింది. దానికి బదులుగా ప్రభుత్వ రాజముద్రను వేసి చిన్నారులకు పోషకాహారాలను పంపిణీ చేస్తోంది. అయితే గతంలో కొన్నింటిపై జగన్ ఫొటోను ముద్రించడంపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తపరిచిన విషయం తెలిసిందే..!
Similar News
News March 20, 2026
కడప జిల్లాలో 10th ఇంగ్లిష్ పరీక్ష వాయిదా.!

రాష్ట్ర ప్రభుత్వం శనివారం రంజాన్ సందర్భంగా సెలవు ప్రకటించింది. దీంతో ఆ రోజున జరగవలసిన పదవ తరగతి ఇంగ్లిష్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఏప్రిల్ 2న ఇంగ్లిష్ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంగ్లిష్ పరీక్ష వాయిదాను గమనించాలని పేర్కొంది.
News March 19, 2026
సీతారాముల కళ్యాణానికి గవర్నర్‌కు ఆహ్వానం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరగనున్న సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర గవర్నర్ S.అబ్దుల్ నజీర్‌ను టీటీడీ AEO వెంకయ్య చౌదరి ఆహ్వానించారు. ఆలయ అర్చకుల మంత్రోచ్ఛారణల నడుమ గవర్నర్‌కు ఆహ్వానం పలికారు. వారి వెంట ఆలయ ఇన్‌ఛార్జ్ DEO శివప్రసాద్, అర్చకులు ఉన్నారు.
News March 19, 2026
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం: కడప SP

కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా, మట్కా, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక చర్యలపై కఠినంగా వ్యవహరించాలని SP నచికేత్ విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. రాజంపేట, ప్రొద్దుటూరు, మైదుకూరు సబ్ డివిజన్ల పరిధిలో నేరాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.


