News June 17, 2024

జగన్ తాడేపల్లి నివాసం వద్ద బారికేడ్ల తొలగింపు

image

AP: తాడేపల్లిలో మాజీ CM జగన్ నివాసం వెనుక రోడ్డుపై భద్రత దృష్ట్యా ప్రజల రాకపోకలు జరగకుండా ఏర్పాటు చేసిన బారికేడ్లను అధికారులు తాజాగా తొలగించారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు, దానికి దిగువనున్న రోడ్డుపై ప్రవేశం లేదు. దీంతో సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు వెళ్లాల్సినవారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం తిరిగి వెళ్లేవారు. టీడీపీ సర్కారు ఆ మార్గాన్ని తాజాగా ప్రజలకు తెరిచింది.

Similar News

News September 15, 2025

భద్రాద్రి: ‘సూర్యాంశ్’ నామకరణం చేసిన KTR

image

అన్నపురెడ్డిపల్లి మాజీ ZPTC దంపతులు లావణ్య-రాంబాబు తమ కుమారుడికి పేరు పెట్టాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను కలిశారు. దంపతులు ‘సు’ అక్షరంతో పేరు కోరగా, KTR తన కుమారుడు హిమాన్షు పేరును గుర్తు చేసుకుని, సూర్యాంశ్ అని నామకరణం చేశారు. KTR దీవెనలు తమ కొడుకును ఆయనలాగే గొప్ప వ్యక్తిని చేస్తాయన్న నమ్మకం ఉందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ అభిమాన నేతతో గడిపిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు.

News September 15, 2025

ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు

image

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ధాత్రిరెడ్డి, ఫైబర్ నెట్ ఎండీగా గీతాంజలి శర్మ, మౌలిక సౌకర్యాలు, పెట్టుబడుల శాఖ ఎండీగా సౌర్యమాన్ పటేల్‌‌తో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా ఐపీఎస్ రాహుల్ శర్మకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News September 15, 2025

బండి సంజయ్‌పై కేటీఆర్ రూ.10 కోట్ల దావా

image

TG: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో రూ.10 కోట్ల దావా పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని గతంలో బండికి కేటీఆర్ నోటీసులు పంపారు. అయితే సంజయ్ వాటిపై స్పందించలేదు. దీంతో కేటీఆర్ చట్టపరమైన చర్యలకు దిగారు.