News June 17, 2024
త్యాగనిరతికి ప్రతీక బక్రీద్: మంత్రి పవన్ కళ్యాణ్

AP: బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలకు మంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రతి పండుగలో గొప్ప ధార్మిక సందేశం, విశిష్టత నిబిడీకృతమై ఉంటుంది. ఇస్లాంపై విశ్వాసం ఉన్నవారు రంజాన్‌ను ఎంత భక్తి, శ్రద్ధలతో జరుపుకొంటారో బక్రీద్‌నూ అంతే నిష్టతో చేస్తారు. ఈ పండుగ ముస్లింలందరికీ భగవదనుగ్రహం కలుగచేయాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పవన్ పేర్కొన్నారు.
Similar News
News March 20, 2026
వాట్సాప్‌లో సూపర్ అప్‌డేట్

వాట్సాప్ త్వరలో ఫోన్ నంబర్ల స్థానంలో యూజర్ నేమ్స్, యునిక్ ఐడీలను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. జూన్‌లో ఇది లాంచ్ కానున్నట్లు సమాచారం. దీంతో ఫోన్ నంబర్ల అవసరం లేకుండానే కొత్త ఫ్రెండ్స్, గ్రూప్స్‌తో కనెక్ట్ అవొచ్చు. ఫోన్ నంబర్లతోనే కంటిన్యూ అవ్వాలనుకునేవారు ఆప్షనల్ ప్రైవసీ ఫీచర్ ఎంచుకోవచ్చు. ఇక దీంతో పాటు వాట్సాప్ లేని వారితో చాట్ చేసేందుకు వీలుగా గెస్ట్ చాట్ ఫీచర్ తేనున్నట్లు తెలుస్తోంది.
News March 20, 2026
రెండు వారాల్లో వీటన్నింటి ధరలు పెరిగాయ్: కాంగ్రెస్

ప్రధాని మోదీ హయాంలో దేశంలో అన్ని ధరలు పెరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. గత రెండు వారాల్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.146, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.60, రిఫైన్డ్ ఆయిల్ రూ.30/L, పామ్ ఆయిల్ రూ.15/L, ఇండస్ట్రియల్ డీజిల్ రూ.22/L, ప్రీమియం పెట్రోల్ రూ.2.35/L, జొమాటో డెలివరీ ఫీ రూ.2.40, విమాన టికెట్లు రూ.425-2,300, ప్లాస్టిక్ బాటిల్ సెట్ రూ.40, ఇండక్షన్ స్టవ్ ధర 40% పెరిగిందని పేర్కొంది.
News March 20, 2026
300 గ్యాంబ్లింగ్, బెట్టింగ్ సైట్లు బ్యాన్

చట్టవిరుద్ధమైన గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్‌సైట్లపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. ఏకంగా అలాంటి 300 సైట్లు, యాప్‌లను నిషేధించింది. వాటిలో ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్, ఆన్‌లైన్ కేసినో ఆఫరింగ్ స్లాట్స్, లైవ్ డీలర్ టేబుల్స్, p-2-p బెట్టింగ్, రియల్ మనీ కార్డ్, సట్టా/మట్కా గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్స్ ఉన్నాయి. మొత్తం 8,400 ఇల్లీగల్ సైట్లు ఉండగా కేంద్రం ఇప్పటివరకు 4,900 సైట్లను బ్లాక్ చేసింది.


