News June 17, 2024
HYD: భారీగా పెరిగిన టమాట ధర..!

నెల క్రితం టమాటకు ధర లేక మిగిలిపోయిన వాటిని రైతు బజార్లలో వదిలిపోయే పరిస్థితి ఎదురైంది. అప్పట్లో రూ.20లోపు ధర పలికింది. ప్రస్తుతం టమాట ధర భారీగా పెరగడంతో వినియోగదారులు బేజారెత్తిపోతున్నారు. HYD, ఉమ్మడి RRలోని పలు రైతు బజార్లలో అధికారికంగా కిలో రూ.57 పలికింది. బహిరంగ మార్కెట్‌లో మాత్రం రూ.100కు చేరువలో ఉంది. రైతు బజార్లలోనూ ఈ వారంలో రూ.100 పలికే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Similar News
News January 16, 2026
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం

శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ విమాన టికెట్ల ఉదంతం కలకలం రేపింది. ఖతర్ ఎయిర్ లైన్స్ విమానంలో దోహా వెళ్లేందుకు సిద్ధమైన 8 మంది ప్రయాణికుల టికెట్లు నకిలీవని తేలాయి. ఈ నకిలీ టికెట్ల వెనుక ఏవరైనా ఏజెంట్ల హస్తం ఉందా? లేదా ట్రావెల్ ఏజెన్సీల మోసమా? అనే కోణంలో శంషాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
News January 16, 2026
HYD: రోడ్డుపై బండి ఆగిందా? కాల్ చేయండి

HYD- విజయవాడ హైవే పై వెళ్తుంటే మీ బండి ఆగిపోయిందా? వెంటనే 1033కి కాల్ చేయండి. హైవే పెట్రోలింగ్ సిబ్బంది మీ వద్దకు వచ్చి సమస్య పరిష్కరిస్తారు. పెట్రోల్, డీజిల్ అయిపోతే అందజేస్తారు. దానికి తగిన ధర చెల్లించాలి. టైర్‌పంచర్ అయితే ఉచితంగా సేవలు అందిస్తారు. ఈ సేవలు 24Hrs అందుబాటులో ఉంటాయి. కుటుంబంతో హ్యాపీగా వెళ్తుంటే కార్ ఆగిపోతే ఆ బాధ వర్ణణాతీతం. అందుకే ఈ నం. సేవ్ చేసుకోండి.. అవసరమవుతుంది.
# SHARE IT
News January 16, 2026
HYD: రూ.40K, రూ.లక్ష సాలరీతో ఉద్యోగాలు

HYD ECILలో 15 పోస్టులను భర్తీ చేయనుంది. ప్రాజెక్ట్ ఆఫీసర్-C(10), SAP SPECIALIST C(5) పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులకు ఏదైనా డిగ్రీలో 50% ఉత్తీర్ణతతో పాటు పనిలో అనుభవం గల అభ్యర్థులు జనవరి 28, 29 తేదీల్లో ECIL HYDలో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ఎలాంటి అప్లికేషన్, ఫీజు లేదు. ప్రాజెక్ట్ ఆఫీసర్‌లకు నెలకు రూ.40,000, SAP స్పెషలిస్ట్‌కు రూ.1,25,000 జీతం ఉంటుంది. వివరాలకు <


