News June 17, 2024

ఆ లింక్ క్లిక్ చేస్తే మీ వాట్సాప్ హ్యాక్

image

‘పీఎం కిసాన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్’ అంటూ వాట్సాప్ గ్రూప్‌ల్లో ఓ APK ఫైల్ చక్కర్లు కొడుతోంది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో ఈ లింక్ క్లిక్ చేసిన 10 మంది వాట్సాప్ హ్యాక్ అయింది. వారి అకౌంట్లు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లాయి. PM కిసాన్ యాప్ లింక్‌ను క్లిక్, ఫార్వార్డ్ చేయొద్దని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా బాధితులు ఉంటే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని చెప్పారు.

Similar News

News January 16, 2026

మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల

image

TG: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశ పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. ఆరో తరగతిలో ప్రవేశాలతో పాటు 7-10 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. OC విద్యార్థులు రూ.200, మిగతావారు రూ.125 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మార్చి/ఏప్రిల్‌లో హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. April 19న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి.

News January 16, 2026

మెగ్నీషియంతో జుట్టుకు మేలు

image

వయసుతో సంబంధం లేకుండా అందర్నీ వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. దీనికోసం పైపైన ఎన్ని షాంపూలు, నూనెలు వాడినా ఉపయోగం ఉండదంటున్నారు నిపుణులు. మెగ్నీషియం లోపం వల్ల మాడుకు రక్త ప్రసరణ తగ్గడంతో పోషకాలు అందక జుట్టు సమస్యలు వస్తాయి. పాలకూర, గుమ్మడి గింజలు, బాదం, అవిసెగింజలు, చియా, బీన్స్‌, చిక్కుళ్లు, అరటి, జామ,కివీ, బొప్పాయి, ఖర్జూరాలు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

News January 16, 2026

ప్రభాస్ ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ వచ్చేసింది

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న ‘స్పిరిట్’ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేస్తామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 8 భాషల్లో రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచిన విషయం తెలిసిందే.