News June 17, 2024
రేపు వైద్యారోగ్యశాఖ మంత్రి అనంతపురానికి రాక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ ఈనెల 18వ తేదీన అనంతపురం రానున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వై.సత్య కుమార్ యాదవ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా అనంతపురం రానున్న నేపథ్యంలో సప్తగిరి సర్కిల్, ఓల్డ్ టౌన్, సంగమేష్ సర్కిల్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.
Similar News
News March 15, 2026
అనంత: పన్ను కట్టాల్సిందే.. ప్రజలకు డీపీవో అల్టిమేటం!

బకాయిదారు లబ్ధిదారు తప్పనిసరిగా ఇంటి పన్ను చెల్లించాలని జిల్లా పంచాయతీ అధికారి నాగరాజ నాయుడు తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. పన్ను విషయంలో ఎవరికీ మినహాయింపు లేదన్నారు. లక్షల్లో బకాయిలు ఉన్నవారు చాలామంది ఉన్నారన్నారు. పెండింగ్ బకాయిదారుల జాబితా తయారు చేశామన్నారు. ఇంటి పన్ను నెలాఖరులోగా తప్పనిసరిగా చెల్లించాలన్నారు. ఎక్కువగా ఉన్న బకాయిదారులు స్పందించకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
News March 15, 2026
చదువుకోవడం ఇష్టం లేక సూసైడ్

పెద్దవడుగూరు మండలం విరుపాపురంలో యువకుడు కళ్యాణ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 3 ఏళ్ల క్రితం ఇంటర్ ఫస్టియర్‌లో కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ కావడంతో ప్రస్తుతం ఇంటి వద్ద ఖాళీగా ఉన్నాడు. సప్లమెంటరీ రాసుకొమ్మని కుటుంబసభ్యులు చెప్పారు. కళ్యాణ్‌కు చదువుకోవడం ఇష్టం లేక మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకొన్నాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
News March 14, 2026
పదో తరగతి పరీక్షలకు పటిష్ఠమైన బందోబస్తు: ఎస్పీ

పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అనంతపురం ఎస్పీ జగదీశ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరిగే పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్ వద్ద, ప్రశ్నపత్రాలు తీసుకుని వెళ్లే సమయంలో బందోబస్తు, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.


