News June 17, 2024
WGL: నకిలీ ఐడీలతో ఇన్‌స్టాగ్రాంలో బెదిరింపులు!
నకిలీ ఐడీలతో ఇన్‌స్టాగ్రాంలో సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. శంభునిపేటకు చెందిన ఉపాధ్యాయుడు నీలం రాజు సెల్‌ఫోన్‌లోని ఇన్స్టాగ్రాం యాప్‌నకు నకిలీ ఐడీల ద్వారా అసభ్య సందేశాలు పంపిస్తూ..15 రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రాజుకు సంబంధించిన ఫొటోలు మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యులకు పంపిస్తూ రూ.30 వేలు ఇస్తే సందేశాలు ఆపుతామంటూ డిమాండ్ చేస్తున్నారు.దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News November 30, 2024
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్
వరంగల్ నగరంలోని ఎంజీఎంం హాస్పిటల్‌ను వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రోగుల సౌకర్యార్థం చేపడుతున్న పనులను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె రోగులతో స్వయంగా మాట్లాడి అందుతున్న వైద్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News November 29, 2024
ప్రజా పాలన వేడుకలను ఘనంగా నిర్వహించండి: కలెక్టర్ ప్రావీణ్య
ప్రజా పాలన విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీదేవి రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. నేడు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజా పాలన విజయోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న దృష్ట్యా డిసెంబర్ 3న మునిసిపాలిటీల్లో అర్బన్ డే వేడుకలను సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు చేశారు.
News November 29, 2024
శాంతి భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి: వరంగల్ సీపీ
శాంతి భద్రతల విషయంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం అప్రమత్తంగా వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులకు సూచించారు. కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం నేర సమీక్ష నిర్వహించారు. సూదీర్ఘకాలంగా పెండిరగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రధానంగా మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు.