News June 17, 2024

బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన PMO

image

పశ్చిమ బెంగాల్‌‌లో రైళ్లు ఢీకొన్న ఘటనలో బాధితులకు ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఇవ్వనున్నారు. ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద ఈ ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోగా 60మంది గాయపడ్డారు. వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Similar News

News March 18, 2026

ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా?

image

గ్యాస్ కొరత నేపథ్యంలో ఇటీవల ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం పెరిగింది. అయితే ఈ స్టవ్‌లను ఉపయోగించిన వెంటనే ఆఫ్ చేయొద్దని పలు కంపెనీలు సూచిస్తున్నాయి. వంట పూర్తయ్యాక కొంత సేపు స్టాండ్ బై మోడ్‌లో ఉంచాలంటున్నాయి. ఇలా చేస్తే స్టవ్‌లో ఉన్న కూలింగ్ ఫ్యాన్ లోపలి భాగాల వేడిని తగ్గిస్తుందని చెబుతున్నాయి. వెంటనే ఆఫ్ చేస్తే స్టవ్‌లోని సున్నితమైన భాగాలు ఎక్కువసేపు వేడిగా ఉండి పనితీరు తగ్గుతుందంటున్నాయి.

News March 18, 2026

మూసీ ప్రక్షాళనను BRS అడ్డుకుంటోంది: భట్టి

image

TG: మూసీ ప్రక్షాళనను BRS వ్యతిరేకిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలో విమర్శించారు. పునరుజ్జీవనంపై ఆ పార్టీ వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు అదే ప్రాంతంలో అపార్ట్‌మెంట్లు నిర్మించి పునరావాసం కల్పిస్తామని సీఎం చెప్పారని గుర్తు చేశారు. కానీ వారి జీవితాలు బాగుపడకుండా మురికి కూపంలోనే ఉండాలని BRS కోరుకుంటోందని భట్టి మండిపడ్డారు.

News March 18, 2026

లెక్క లెక్కే.. బుమ్రాకు న్యాయం చేసేలా BCCI ప్లాన్స్

image

కోహ్లీ, రోహిత్, జడేజా, బుమ్రా A+ కేటగిరీలో ₹7 కోట్లు అందుకునేవారు. రోహిత్, కోహ్లీ ఒకే ఫార్మాట్ ఆడుతుండటం, జడేజా T20Iల నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం బుమ్రా ఒక్కరే 3 ఫార్మాట్లలో కొనసాగుతున్నారు. దీంతో A+ కేటగిరీని తొలగించి అందరినీ A గ్రేడ్‌కు మార్చడంతో ఆయనకు ₹2 కోట్ల నష్టం జరుగుతోంది. దీన్ని భర్తీ చేసేందుకు BCCI కాంట్రాక్ట్ రివైజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అక్షర్, సిరాజ్‌ల కాంట్రాక్టూ మారొచ్చు.