News June 17, 2024

విధేయతకే పట్టం

image

అత్యధిక మెజార్టీతో గెలిచి అందరినీ ఆకర్షించిన గాజువాక MLA పల్లా శ్రీనివాసరావు ఇకపై ఏపీ TDP బాధ్యతలు మోయనున్నారు. YCP ప్రభుత్వంలో అనేక కేసులు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఎదురొడ్డి నిలిచారు. పార్టీ మారాలని ఒత్తిడి వచ్చినప్పటికీ TDPలోనే కొనసాగి విధేయతను చాటుకున్నారు. 7రోజులు ఆమరణదీక్ష చేసి స్టీల్‌ప్లాంట్ ఉద్యమానికి ఊపు తెచ్చిన పల్లా.. గాజువాక హౌస్ కమిటీ భూములు, అగనంపూడి టోల్ గేట్ సమస్యపై పోరాడారు.

Similar News

News November 7, 2025

ఆనందపురం: అనుమానాస్పద స్థితిలో కార్పెంటర్ మృతి

image

ఆనందపురం మండలం నేలతేరు గ్రామానికి చెందిన కడియం కనకరాజు (53) గురువారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కార్పెంటర్‌గా పనిచేస్తున్న అతను ఆనందపురం గ్రామంలోని కోళ్ల ఫారం షెడ్ నిర్మాణానికి వెళ్లగా అక్కడ మృతి చెందాడు. మొదట సహజ మరణంగా భావించిన కుటుంబ సభ్యులు తర్వాత అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 7, 2025

విశాఖను డ్రగ్స్‌కు అడ్డగా మార్చారు: పట్టభి రామ్

image

విశాఖ డ్రగ్స్ కేసులో YCP విద్యార్థి నాయకుడు కొండా రెడ్డి అరెస్టుతో రాజకీయాలు వేడెక్కాయి. TDP నేత పట్టాభి రామ్ గురువారం మాట్లాడుతూ .. ‘YCP యువజన విభాగం డ్రగ్స్ ముఠాగా మారింది. జగన్ హయాంలో విశాఖను డ్రగ్స్‌కు అడ్డాగా మార్చారు’అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ‘కొండా రెడ్డి అరెస్టు అక్రమం. ప్రభుత్వం కక్షతో YCP నేతలను టార్గెట్ చేస్తోంది’ అని ఆరోపించారు.

News November 7, 2025

విశాఖ: ప్రమాద బాధితులకు పరిహారం అందజేత

image

విశాఖ సీపీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం పరిహారం అందజేశారు. హిట్ అండ్ రన్ కేసులో గాయపడిన సీతమ్మధారకు చెందిన కనపర్తి వీరేందర్, గ్రీన్ గార్డెన్‌కు చెందిన జాగు సత్యనారాయణకు రూ.50వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇప్పటివరకు 90 మందికి రూ.72 లక్షల పరిహారం అందించినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు.