News June 17, 2024
ఆదాయ వనరుగా ప్లాస్టిక్ వ్యర్థాలు

చార్ ధామ్ యాత్ర నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. ఈక్రమంలో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలతో అధికారులు ‘యాంటీ వేస్ట్ డ్రైవ్’లను నిర్వహించారు. 3 టన్నులకు పైగా వ్యర్థాలను సేకరించి విక్రయించడం ద్వారా జోషిమఠ్ మున్సిపాలిటీకి రూ.1.02 కోట్ల ఆదాయం వచ్చింది. పర్వతాలకు సమస్యగా మారుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చుకున్నారు.
Similar News
News March 14, 2026
మళ్లీ వర్షాలు!

ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు ప్రజలకు కాస్త ఊరట కలగనుంది. ద్రోణి ప్రభావంతో రేపటి నుంచి పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-50KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెల 18, 19, 20 తేదీల్లో HYD, ఉ.గోదావరి, తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప, నెల్లూరు జిల్లాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
News March 14, 2026
‘శల్య సారథ్యం’ అంటే?

ఒకరిని నమ్మి కీలక బాధ్యతలు అప్పగిస్తే ప్రత్యర్థికి మేలు చేసేలా వ్యవహరించినప్పుడు ఈ జాతీయం వాడుతుంటారు. భారతంలో పాండవులకు శల్యుడు మేనమామ. అయితే దుర్యోధనుడు కుట్రతో చేసిన సత్కారానికి మెచ్చి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులకు సాయం చేయడానికి ఒప్పుకుంటారు. తర్వాత నిజం తెలుసుకొని ధర్మరాజు వినతితో కర్ణుడి రథసారథిగా ఉంటూ సూటిపోటి మాటలతో అతని ఏకాగ్రతను దెబ్బతీసి ఓటమికి కారణమవుతారు.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 14, 2026
సీఈసీని ఎలా తొలగించవచ్చు?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం <<19371253>>ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను<<>> తొలగించవచ్చు. ఆర్టికల్ 124(4) ప్రకారం దుష్ప్రవర్తన లేదా అసమర్థత నిరూపితమవ్వాలి. తొలగింపునకు గల కారణాలతో ఓ తీర్మానాన్ని పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. LSలో 100, RSలో 50 మంది సభ్యులు సంతకాలు చేసి స్పీకర్/ఛైర్మన్‌కు సమర్పించాలి. దాన్ని వారు అంగీకరిస్తే ఓటింగ్‌లో 2/3 మెజార్టీ రావాలి. ఆ తర్వాత రాష్ట్రపతి కూడా ఆమోదించాలి.


