News June 17, 2024
T20WC సూపర్-8: గ్రూప్-1, గ్రూప్-2లో జట్లివే..
టీ20 WCలో కీలకమైన రెండో దశకు తెర లేవనుంది. రేపటి నుంచి సూపర్-8 పోరు ప్రారంభం కానుంది. ఇందులో జట్లు 2 గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. గ్రూప్-1లో భారత్, AUS, అఫ్గానిస్థాన్, బంగ్లా చోటు సంపాదించాయి. ఇక గ్రూప్-2లో USA, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పోటీ పడతాయి. ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన టీమ్‌లు సెమీస్‌కు చేరుతాయి. భారత్ 20న ఆఫ్గానిస్థాన్, 22న బంగ్లా, 24న AUSతో ఆడనుంది.
Similar News
News December 29, 2024
RRR సూపర్ గేమ్ ఛేంజర్ కానుంది: కోమటిరెడ్డి
TG: రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులకు కేంద్రం టెండర్లు పిలవడంపై మంత్రి కోమటిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని వెల్లడించారు. RRR కోసం సీఎంతో కలిసి ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లి గడ్కరీకి వినతిపత్రాలు ఇచ్చినట్లు చెప్పారు. ORRలాగే RRR కూడా సూపర్ గేమ్ ఛేంజర్ కానుందని తెలిపారు. సీఎం చొరవ, తన కృషికి దక్కిన ఫలితం ఇదని పేర్కొన్నారు.
News December 29, 2024
నాగార్జునసాగర్ భద్రతపై కన్ఫ్యూజన్
నాగార్జునసాగర్ డ్యామ్ భద్రతపై గందరగోళం తలెత్తింది. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం నేపథ్యంలో CRPFకు కేంద్రం గతంలో బాధ్యతలు అప్పగించింది. డ్యామ్ భద్రతా విధుల నుంచి CRPF వైదొలుగుతున్నట్లు చెప్పడంతో తెలంగాణ SPF ఆ బాధ్యతలు స్వీకరించింది. మళ్లీ రాత్రి విధుల్లోకి CRPF సిబ్బంది వచ్చి భద్రతా బాధ్యతలు చేపట్టాయి. దీంతో ఏం జరుగుతుందనేది తెలియక స్థానిక అధికారులు అయోమయానికి గురయ్యారు.
News December 28, 2024
కలెక్టర్ పిల్లలైతే ఇలాగే ఊరుకుంటారా?: తల్లి
రాజస్థాన్లో బోరుబావిలో పడిన <<14987957>>చిన్నారి<<>> తల్లి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా కూతురు అందులో పడి 6 రోజులైంది. ఆకలి, దాహంతో ఎంత వేదన అనుభవిస్తుందో? కలెక్టర్ పిల్లలైతే ఇలాగే వదిలేసేవారా?’ అని ఏడుస్తూ ప్రశ్నించారు. తన కూతురిని త్వరగా బయటికి తీసుకురావాలని వేడుకున్నారు. ఈనెల 23న చిన్నారి పొలం వద్ద ఆడుకుంటూ బోరుబావిలో పడింది. ఆమెను క్షేమంగా తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.