News June 17, 2024
కోడెలను వేధించిన కర్మ జగన్‌ను వెంటాడుతోంది: దేవినేని
AP: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను వేధించిన పాపం తాలూకు కర్మ మాజీ సీఎం జగన్‌ను వెంటాడుతోందని టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రూ.కోట్ల విలువైన ఫర్నిచర్‌ను ఇంట్లో పెట్టుకోవడం దారుణమని మండిపడ్డారు. ‘ఒప్పుకొంటే తప్పు ఒప్పవుతుందా? దొరికిపోయాక ఫర్నిచర్ ఇస్తాం, రేటు కడతాం అంటే చట్టం ఎలా ఒప్పుకొంటుంది? చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వైఎస్ జగన్ సమాధానమివ్వాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News December 28, 2024
విశాఖలో సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం
AP: విశాఖ వాసులకు అలర్ట్. GVMC పరిధిలో జనవరి 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం అమల్లోకి రానుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిబంధనలు కఠినంగా అమలు చేయాలని మేయర్, కమిషనర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. వీటిని వాడే వారిపై జరిమానా విధించడంపై సమాలోచనలు చేస్తున్నారు. ప్రజలకు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంపై అవగాహన కల్పించాలని భావిస్తున్నారు.
News December 28, 2024
పవన్ ‘OG’ మూవీపై మేకర్స్ కీలక ప్రకటన
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ మూవీపై మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ‘‘ఓజీ’పై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానం మా అదృష్టం. కానీ పవన్ ఎక్కడికి వెళ్లినా మీరు ఓజీ.. ఓజీ అని అరిచి ఇబ్బంది పెట్టొద్దు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఆయనను, ఆయన స్థాయిని గౌరవించండి. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి. ఓజీ పండుగ వైభవం చూద్దాం’ అని పేర్కొన్నారు.
News December 28, 2024
ప్రధాని మోదీని కలిసిన గుకేశ్
వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా గుకేశ్‌కు మోదీ చెస్ బోర్డు కానుకగా అందించారు. అనంతరం శాలువాతో సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇద్దరూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘ప్రధాని మోదీని కలవడం నా జీవితంలోనే అత్యుత్తమమైన క్షణం’ అని గుకేశ్ పోస్ట్ చేశారు. కాగా ఇటీవల తలైవా రజినీకాంత్‌ను కూడా గుకేశ్ కలిసిన విషయం తెలిసిందే.