News June 17, 2024

19న పార్టీ నేతలతో YS జగన్ కీలక భేటీ

image

AP: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీచేసిన అభ్యర్థులతో ఈ నెల 19న వైసీపీ అధినేత జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఎంపీ అభ్యర్థులూ హాజరుకానున్నారు. రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో ఇప్పటికే సమావేశమైనందున వారికి మినహాయింపునిచ్చారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు సమావేశం జరగనుంది. ఎన్నికల్లో ఓటమి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.

Similar News

News January 17, 2025

ఈ నెలలోనే ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాల పెంపు!

image

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు జీతాలు పెంచనున్నట్లు ‘మనీకంట్రోల్’ తెలిపింది. జనవరి 2025 నుంచి వార్షిక వేతనాలు 6-8 శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత మళ్లీ APRలో జీతాల పెంపు ఉండే అవకాశం ఉంది. కాగా, డిసెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ రూ.6,806 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ప్రస్తుతం అందులో 3.23 లక్షల ఉద్యోగులు ఉన్నారు.

News January 17, 2025

మంచు మనోజ్ దంపతులపై కేసు నమోదు

image

AP: మంచు మనోజ్, ఆయన సతీమణి మౌనికపై చంద్రగిరి పీఎస్‌లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా MBUలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించారని మోహన్ బాబు పీఏ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వారితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. మరోవైపు తమపై దాడి చేశారని మంచు మనోజ్ ఫిర్యాదు చేయడంతో మోహన్ బాబు పీఏతో పాటు మరో 8 మంది సిబ్బందిపై కేసు నమోదైంది.

News January 17, 2025

అలా చేస్తే నిర్మాతలకు బర్డెన్: అనిల్ రావిపూడి

image

సినిమా చిత్రీకరణపై డైరెక్టర్ అనిల్ రావిపూడి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఒక్క మూవీని 3-5 నెలల్లో పూర్తిచేస్తానని తెలిపారు. ‘రోజుకు రూ.20-25 లక్షలు ఖర్చు అవుతాయి. అందుకే సినిమాటోగ్రాఫర్‌కు ముందే హైలైట్స్‌ ఏవో చెప్తా. క్వాలిటీ కోసం ఏంకావాలో అదే చేయండని సూచిస్తా. సంక్రాంతికి వస్తున్నాం మూవీ కూడా 70 రోజుల్లో పూర్తిచేశా. ఎక్కువ రోజులు తీస్తే ప్రొడ్యూసర్‌కు ఇంట్రెస్ట్ బర్డెన్ పెరుగుతుంది’ అని తెలిపారు.