News June 17, 2024

వైసీపీపై ప్రేమ తగ్గకపోతే ఉద్యోగాల్ని వదిలేయండి: హోం మంత్రి అనిత

image

AP: కొంతమంది పోలీసుల్లో ఇంకా వైసీపీ రక్తమే ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. ఆయా అధికారులు వారి వ్యవహారశైలిని మార్చుకోవాలని ఆమె సూచించారు. అయినా వైసీపీపై ప్రేమ తగ్గకపోతే ఉద్యోగాల్ని వదిలేసి ఆ పార్టీకోసం పనిచేసుకోవచ్చని సూచించారు. ఈరోజు సింహాచలం అప్పన్నను ఆమె దర్శించుకున్నారు. దేవస్థానం భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాకుండా చూసుకుంటానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

Similar News

News December 29, 2024

ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్?

image

AP: ఏపీ నూతన సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ విజయానంద్ నియమితులైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రేపు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. కాగా విజయానంద్ 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి.

News December 29, 2024

ఫ్లైట్ 16 గంటల ఆలస్యం.. ప్రయాణికుల పడిగాపులు

image

ఇండిగో సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈరోజు ముంబై నుంచి ఇస్తాంబుల్ వెళ్లాల్సిన ఆ సంస్థ విమానం 16 గంటలు ఆలస్యమై ఆ తర్వాత రద్దైంది. ముంబై ఎయిర్‌పోర్టులోనే పడిగాపులుగాసిన 100మంది ప్రయాణికులు ఇండిగోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కనీసం సమాచారం ఇవ్వలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కాగా.. తాము ప్రయాణికులకు డబ్బులు రీఫండ్ చేసి వేరే ఫ్లైట్‌లో వారిని పంపించామని ఇండిగో వివరించింది.

News December 29, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.