News June 17, 2024

కారును ఢీకొట్టిన పెద్ద పులి

image

AP: నెల్లూరు-ముంబై హైవేపై ప్రయాణిస్తున్న కారును పెద్ద పులి ఢీకొట్టింది. బద్వేలుకు చెందిన ఐదుగురు కారులో వెళ్తుండగా నెల్లూరు జిల్లా కదిరినాయుడుపల్లె సమీపంలో ఈ ఘటన జరిగింది. కారు ముందుభాగం ధ్వంసంకాగా, పులి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాసేపటికి అది అడవిలోకి వెళ్లిపోయింది. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. పులి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News January 8, 2026

ప్రసారభారతిలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>ప్రసారభారతి<<>> 14 మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. MBA/MBA(మార్కెటింగ్) పీజీ డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గల వారు JAN 21 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 35ఏళ్ల లోపు ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. చెన్నై, HYD, ముంబై, కోల్‌కతాలో ఉద్యోగాలకు నెలకు రూ.35K- రూ.50K, మిగతా సిటీ ఉద్యోగాలకు రూ.35K- రూ.42K చెల్లిస్తారు. https://prasarbharati.gov.in

News January 8, 2026

ఫిబ్రవరి 3న మున్సిపల్ ఎన్నికలు: రాంచందర్ రావు

image

TG: రాష్ట్రంలో ఫిబ్రవరి 3న మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు చెప్పారు. ఎన్నికలకు ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చిందని, ఈ నెల 16 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. వరంగల్‌లో జరిగిన బీజేపీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎలక్షన్స్‌లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎన్నికల తేదీలు ఇవేనంటూ ఈసీ కంటే ముందే రాంచందర్ రావు ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది.

News January 8, 2026

HT పత్తి విత్తనాలు కొనొద్దు: మంత్రి తుమ్మల

image

TG: HT పత్తి విత్తనాల అమ్మకాలను రాష్ట్రంలో అరికట్టాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. ఫీల్డ్ ట్రయల్స్‌లో ఫెయిలైనందున కేంద్రం ఆ కంపెనీ విత్తనాల అమ్మకాలకు పర్మిషన్ ఇవ్వలేదన్నారు. అధిక దిగుబడి వస్తుందనే ఆశతో రైతులు HT పత్తి విత్తనాలను కొని మోసపోవద్దని కోరారు. పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కో-మార్కెటింగ్‌కు విధివిధానాలు రూపొందించాలన్నారు.