News June 17, 2024

11 మంది స్థానాల్లోనూ నేను ఆడలేను: బాబర్

image

ODIWC, T20WCలో గ్రూప్ దశలోనే ఎలిమినేట్ కావడంతో తనపై వస్తున్న విమర్శలపై పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఘాటుగా స్పందించారు. ‘మేం ఒక్క ఆటగాడి వల్ల ఓడిపోలేదు. జట్టుగా గెలిచాం.. జట్టుగానే ఓడిపోయాం. అందరూ కెప్టెన్‌వైపు వేలు చూపిస్తున్నారు. కానీ నేను 11 మంది స్థానాల్లోనూ ఆడలేను. టీమ్‌లో ఎవరి పాత్ర వారికి ఉంటుంది. ఒకవేళ నేను సారథ్య బాధ్యతల నుంచి వైదొలగాలనుకుంటే అందరి ముందూ ప్రకటిస్తా’ అని పేర్కొన్నారు.

Similar News

News July 7, 2025

ముల్డర్ సరికొత్త చరిత్ర

image

జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్ వియాన్ ముల్డర్ సంచలనం నమోదు చేశారు. అరంగేట్ర టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ బాదిన తొలి కెప్టెన్‌గా నిలిచారు. 297 బంతుల్లో 38 ఫోర్లు, 3 సిక్సర్లతో ఈ మార్క్ చేరుకున్నారు. టెస్టుల్లో ఇది రెండో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ. అంతకుముందు సెహ్వాగ్ 278 బంతుల్లో ఈ ఘనత అందుకున్నారు.

News July 7, 2025

తెలంగాణ కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జులు

image

* ఖమ్మం- వంశీచంద్ రెడ్డి, * మెదక్- పొన్నం ప్రభాకర్
* నల్గొండ- సంపత్ కుమార్
* వరంగల్- అడ్లూరి లక్ష్మణ్
* హైదరాబాద్- జగ్గారెడ్డి
* మహబూబ్‌నగర్- కుసుమకుమార్
* ఆదిలాబాద్- అనిల్‌ యాదవ్
* కరీంనగర్- అద్దంకి దయాకర్
* నిజామాబాద్- హుస్సేన్
* రంగారెడ్డి- శివసేనారెడ్డి

News July 7, 2025

కిలోకు రూ.12 చెల్లించి మామిడి కొనుగోళ్లు

image

AP: మద్దతు ధర లేక అల్లాడుతున్న తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వం ఆదుకుంటోంది. ప్రస్తుతం కేజీకి రూ.8 చెల్లిస్తుండగా, ప్రభుత్వం అదనంగా రూ.4 ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిలో మామిడికి రూ.12 చెల్లిస్తున్నారు. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 3.08 మెట్రిక్ టన్నుల మేర మామిడిని ట్రేడర్లు, ప్రాసెసింగ్ యూనిట్ల వారు కొనుగోలు చేశారు.